హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో బాలయ్య సినిమా

balayya new movie

నందమూరి బాలకృష్ణ.. తనతరం హీరోల్లో ఇంకా దూకుడుగా వెలుతోన్న స్టార్. వయసు మీదపడినా ఆ తరహా పాత్రల వైపు కాకుండా ఇంకా పాత స్టైల్లోనే దబిడి దిబిడీ పాత్రలతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తన్నాడు. కానీ ఈ మధ్య ఇవేవీ ఆకట్టువడం లేదు. దీంతో తను స్లంప్ లోఉన్న ప్రతిసారీ ఆదుకునే బోయపాటి శ్రీనుతో సనిమాకు సిద్ధమవుతున్నాడు ఇప్పుడు. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయిందీ సినిమా అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఎప్పట్లానే ఇందులోనూ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తాడు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేస్తున్నారట. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ .. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు ముందు నుంచీ వస్తూనే ఉన్నాయి. అవి నిజమే అంటూ మరికొన్ని హింట్స్ వస్తున్నాయి. బాలకృష్ణ – బి గోపాల్ ది మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి.

అందుకే గోపాల్ కు మరో ఛాన్స్ ఇస్తున్నాడు బాలయ్య. బోయపాటి సినిమా తర్వాత మొదలు కాబోతోన్న ఈ చిత్రం ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా వస్తుందని చెబుతున్నారు.  ‘టేకెన్’అనే హాలీవుడ్ మూవీని పోలిన కథతోనే ఈ సినిమా ఉంటుందట. అచ్చం అదే అని కాదు కానీ ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ కూతురు సడెన్ గా కనిపించకుండా పోతుంది. ఆమెను వెదుకుతూ తన శతృవులను కనిపెడుతూ.. వెళతాడు హీరో. ఈ క్రమంలో తన పాత లైఫ్ కు సంబంధించిన శతృవులే కూతురును కిడ్నాప్ చేశారని తెలుసుకుని.. వారిని అంతమొందించి ఆ బిడ్డను ఎలా కాపాడుకున్నాడు అనేదే కథట. టేకెన్ కూడా ఇదే కథతో వచ్చింది.  పై రెండు సిరీస్ లు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాలయ్యతో అలాంటి పాత్రనే చేయించబోతున్నాడట గోపాల్. ఇందుకోసం బాలయ్య కూతురుగా ఓ టీనేజ్ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు అంటున్నారు. ఏదేమైనా బాలయ్యతో ఇలాంటి సినిమాలు వర్కవుట్ అవుతాయి. కాకపోతే బి గోపాల్ ఈ సారి పల్నాటి బ్రహ్మనాయుడును మరిచిపోయేంత పకడ్బందీ కంటెంట్ తో రావాల్సి ఉంటుంది.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *