భారత్ లో ఉన్నామా? పాకిస్థాన్ లోనా?

3
Bandi Sanjay Condemn Bainsa Riots
Bandi Sanjay Condemn Bainsa Riots

Bandi Sanjay Condemn Riots

భైంసా లో అల్లర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ అల్లర్లలో ముగ్గురు  జర్నలిస్టులు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటం పై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిపోర్టర్లు, పోలీసులపై పై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. మనం భారత్ లో ఉన్నామా పాకిస్థాన్ లో ఉన్నామా అని నిలదీశారు. పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయవద్దని సూచించారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే భైంసా లో తరుచూ అల్లర్లు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ తరలించాలని డిమాండ్ చేశారు.

Telangana Bjp President