బండి సంజయ్ పై హత్యాయత్నం డ్రామా

7
Bandi Sanjay New Drama
Bandi Sanjay New Drama

Bandi Sanjay New Drama

కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల‌ను వ‌దిలిపెట్టేసి బండి సంజ‌య్ స్వేరోస్ అనే సంస్థ మీద ప‌డ్డారు. ఈ సంఘం స‌భ్యులు ఇనుప రాడ్లు చేత బట్టి త‌మ కాన్వాయి కి అడ్డం త‌గిలార‌ని బీజేపీ ప్ర‌చారం చేస్తోంది. కాన్వాయిలోని కార్లలో సంజయ్ కోసం వేదికిన ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ అనుచరులు వెతికారంటూ కొత్త నాట‌కం మొద‌లు పెట్టార‌ని తెలుస్తోంది. వీరిని బీజేపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నార‌ని, సంజ‌య్ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని ప్ర‌చారం చేస్తోంది. సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డి కారు పై ఇనుప రోడ్ల తో స్వేరోస్ దాడి చేశార‌ని, కారు అద్దాలు ధ్వంసం చేశార‌ని ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసులు క‌నీస భ‌ద్ర‌త క‌ల్పించ‌డం లేద‌ని బీజేపీ విమ‌ర్శించింది. మొత్తానికి, బీజేపీ చేస్తున్న ఈ కొత్త నాటకాన్ని ప్ర‌జ‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఓట్లు లేక‌పోయినా ఈ కొత్త నాట‌క‌మేమిటంటూ విమ‌ర్శిస్తున్నారు.

 

Bjp Political News