bandla ganesh comments
సినిమా ఇండస్ట్రీలో పాంపరింగ్(భజన) అనేది సర్వ సాధారణం. అందులోనూ ఆ బ్యాచ్ కు హెడ్ లా(కనీసం బయటపడతాడు) కనిపిస్తాడు బండ్ల గణేష్. తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకుని మరీ అవతలి వారిని పొగుడుతుంటాడు. అది అతనికి అవకాశాలు తెస్తుంది. వాటిని ఎంత వరకూ ఉపయోగించుకుంటాడు అనేది అతని టాలెంట్ ను బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ఏకంగా దేవుడు అని చెబుతుంటాడు. అతని బర్త్ డే రోజున మాత్రం ‘పావలా కళ్యాణ్’అని రాశాడు అది వేరే విషయం. మొత్తంగా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను దేవుడు అంటూ అతని ఫ్యాన్స్ లోనూ సింపతీ కొట్టేస్తూ వస్తోన్న బండ్ల గణేష్ కొన్నాళ్లుగా పవన్ తో సినిమా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే పవన్ అతన్ని దగ్గరకు రానివ్వడం లేదు అని ఆ మధ్య వినిపించింది. బట్ ఫైనల్ గా తను పవన్ ను కలిశాడు. ఫోటో దిగాడు. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. మా బాస్ మరోసారి ఓకే చెప్పాడు. థ్యాంక్యూ మై గాడ్ అని రాశాడు. దీంతో చాలామంది ఇది నిజమే అనుకుంటున్నారు. కానీ తరచి చూస్తే అతని ట్వీట్ లో నిజమెంత అనేది తేలిపోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలకూ నిర్మాతలున్నారు. దర్శకులూ ఫైనల్ అయ్యారు. ఓ సినిమా సంక్రాంతికి వస్తుంది.
మరో మూడు సినిమాలు రావడానికి కనీసం రెండున్నరేళ్లు పడుతుంది. అంటే 2022 వరకైనా బిజీగానే ఉంటాడు. బండ్లకు అవకాశం వస్తే ఆ టైమ్ కు అవుతుంది. బట్ ఆ లోగానే 2024 ఎన్నికలకు ప్రిపేర్ కావాలి. ఎన్నికల మేటర్ అలా ఉంచినా.. ఎన్నికలకు ముందు కేవలం త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు అనే మాటలూ వస్తున్నాయి. ఇది ఎలాగూ హారిక హాసిని బ్యానర్ లోనే ఉంటుంది. మరి బండ్ల గణేష్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు ఎలా చేస్తాడు..? సో.. తరచి చూస్తే కేవలం కాస్త ప్రమోషన్ తో పాటు మరింత హైప్ కోసమే బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను వాడుకుంటున్నాడు తేలిపోతోంది కదా..? అన్నట్టు ఆ మధ్య కేవలం ఇకపై వరుసగా చిన్న సినిమాలే చేస్తా అని కూడా చెప్పాడు మరి ఆ ఊసు ఇంత వరకూ లేదు. ఏదేమైనా ఇలాంటి ట్రిక్స్ చేయడంలో బండ్ల భలే ముందుంటాడు.