స్కాం రాజా అంటూ పీవీపీని బండ్ల టార్గెట్

Bandla Ganesh Tweet Against PVP

వైసీపీ నేత  పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య ఆర్ధిక లావాదేల్లో చోటు చేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని కేసులు పెట్టుకున్న ఇరువురి నిర్మాతలు విమర్శలు చేసుకుంటున్నారు.  బండ్ల గణేష్ ఈరోజు ట్విట్టర్ వేదికగా పీవీపీపై నిప్పులు చెరిగారు. దేవుడు నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి తప్పు చేశాడని, క్యారెక్టర్ లేనోడా, స్కాం రాజా అని బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలతో పెట్టిన పోస్టులు ఇప్పుడు చర్చ నీయాంశంగా మారాయి. గతంలో పీవీపీ గురించి బండ్ల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో ఆయన స్పందిస్తూ  టెంపర్ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఇస్కాం రాజా పి.వి.పి ”నేను కష్టాల్లో ఉన్నాను నా ఇమేజ్ పెంచు , నా గురించి కాస్త బాగా మాట్లాడు” అని  తన కాళ్ళు పట్టుకుని బతిమిలాడితే  అప్పుడు తాను అలా చెప్పానని  ట్వీట్ చేశారు.

ఎన్నో స్కాములకు మూలం?
ఇక ఇస్కాన్ రాజా గురించి ఈ మాటలు మాట్లాడేందుకు చింతిస్తున్నాను, బాధ పడుతున్నాను అంటూ  మరో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ తాను పీవీపీల వెయ్యి వ్యవహారాలు, వెయ్యి స్కాములు చెయ్యనని నిజాయితీగా బ్రతుకుతున్నానని పేర్కొన్నారు. అంతేకాదు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలోనే  ఉన్నానని, మరో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉంటానని, ఇక్కడే చచ్చిపోతానని పేర్కొన్నారు. నా అప్పులు, తప్పులు అన్నీ కలిపి నువ్ ఒక్కరోజు ముంబైలో జల్సా చేసినంత లేదు నా బ్రతుకు అని పేర్కొన్నారు. నీ స్కాంలు ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందాయని ఎద్దేవా చేశారు. ఎన్నో స్కాములకు మూలమైన నువ్వు ఎందరి జీవితాలను భ్రష్టుపట్టించావో, ఎందర్ని మోసం చేశావో అందరికీ తెలుసన్నారు. పివిపిలాగా రోజుకు ఒక పార్టీ గంటకు ఒక మనిషి ని మార్చడం, రోజుకు కొన్ని తిట్టడం, మరోరోజు పొగడటం అవసరాన్నిబట్టి ప్రవర్తించటం తనకు రాదని బండ్ల గణేష్ అన్నారు.

స్కాం రాజా నీ బ్లడ్ లో లేదు
ఒకరోజు పొగడతావు, ఒక రోజు భుజాన వేసుకెళ్తావు మళ్ళీ రెండో రోజు వాళ్ళ దగ్గరే టికెట్ తెచ్చుకుంటావు. జనం చీదరించినా, చీత్కారించినా  అక్కడే వేలాడుతూ ఉంటావంటూ విమర్శలు గుప్పించారు.  ఇక తాను పీవీపీలా కాదు అని నమ్మిన వారిని చచ్చే దాకా ప్రేమిస్తానని అది తన బ్లడ్ ఓ ఉందని స్కాం రాజా నీ బ్లడ్ లో లేదు అని బండ్ల వ్యాఖ్యానించారు. నా గురించి నా క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ పెద్ద అయిన 50 సంవత్సరాల నుండి ఫైనాన్షియర్ గా ఉన్నా సత్తి రంగయ్య గారిని అడుగు.. ఆయన నేనేంటో చెప్తారు. నువ్వేంటి స్కాం రాజా నా క్యారెక్టర్ గురించి చెప్పేది అని పేర్కొన్న బండ్ల గణేష్ క్యారెక్టర్ లేనోడా అంటూ అనుచితంగా మాట్లాడారు. మరి బండ్ల చేసిన ట్వీట్లపై పీవీపీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

tags: bandla ganesh , potluri vara prasad, pvp, temper movie, financial dispute, twitter ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *