బంగ్లా క్రికెటర్లకు తప్పిన ముప్పు

BANGLA CRICKETERS ESCAPE

  • ప్రార్థనలకు వెళ్లిన సమయంలో మసీదులో కాల్పులు
  • 27 మంది మృతి.. పలువురికి గాయాలు
  • సురక్షితంగా తప్పించుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు
  • న్యూజిలాండ్ లో ఘటన

బంగ్లాదేశ్ క్రికెటర్లు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లా టీమ్.. ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా, అక్కడ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఉదంతం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని రెండు మసీదుల్లో గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్‌ నూర్ మసీదులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 27 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. దాడి సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా మసీదులోనే ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాలకే లిన్‌వుడ్‌ మసీదులో మరో ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా ఘటనా స్థలం వద్దే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నారు. అల్‌ నూర్‌ మసీదు వద్ద కాల్పులకు తెగబడ్డ దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ జరిగినట్లు తెలిపాయి.

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *