పింక్‌ బాల్‌ టెస్టులో బంగ్లాదేశ్ విలవిలా

Spread the love

Bangladesh And India in Pink Ball Test

పింక్‌ బాల్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ నేడు ప్రారంభమైంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ పై  అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత  నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రాత్మక తొలి టెస్టు కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సిటీలోని ప్రధాన వీధులన్నీ గులాబీమయం అయ్యాయి. మరో వైపు పింక్ బాల్ తో ఆడే టెస్టు మ్యాచ్  కోసం  పశ్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గంగూలీ, సచిన్ స్టేడియంకు వచ్చారు. అయితే ఈ చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ లో బంగ్లా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ముందుగా బ్యాటింగ్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు షాద్‌మాన్‌ ఇస్లాం, ఇమ్రూల్‌ కేయాస్‌ ఓపెనర్లుగా రాగా…తొలి బంతిని టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ విసిరాడు. ఇక పింక్‌ బాల్‌ సంధించిన తొలి బౌలర్‌గా ఇషాంత్‌ రికార్డులోకి ఎక్కాడు. ఇక 21.4 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. వీరిలో ముగ్గురు డకౌట్లగా పెవిలియన్‌ చేరడం విశేషం. ఇక ఈ తొలి ఆరు వికెట్లలో ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు పడగొట్టగా..ఇషాంత్‌ రెండు వికెట్లను కుప్పకూల్చాడు. మరోవైపు షమీ ఒక వికెట్ నేలకూల్చాడు. ప్రస్తుతం భారత్ బౌలింగ్ తో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడుతున్నారు.

PINK BALL TEST IN INDIA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *