బాసర అమ్మవారి రత్నం మాయం

BASARA AMMA’S CROWN STONE MISSED

తెలంగాణాకే తలమానికమైన ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర లో అపచారం జరిగింది .అమ్మవారి కిరీటంలో రత్నం మాయమైంది . ఇక్కడి అమ్మవారి మూలవిరాట్ పైనున్న మకుటం నవరత్నాలతో దేదీప్యమానంగా ఉండేది. నవరత్నాలతో అమ్మవారి రూపానికి వన్నె తెచ్చిన కిరీటంలో ప్రస్తుతం ఒక రాయి కనిపించకుండా పోవడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షల్లో భక్తులు వస్తుండడం, రూ. కోట్లలో ఆదాయం సమకూరుతున్నా ఆలయ అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అమ్మవారి విగ్రహం పైనున్న కిరీటం10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు చేయిం చినట్లు తెలుస్తోంది. కోట్ల ఆదాయం ఉన్నా అమ్మవారికి దేవాదాయ శాఖసొంతంగా కిరీటం చేయించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అమ్మవారికి మరొక కిరీటం ఉందని ఆలయ వంశస్తులు అంటున్నారు. నిత్యం అమ్మవారిని అభిషేకిస్తున్నందున ఊడిపోయి ఉండవచ్చని ఆలయ అర్చకులు అంటున్నారు.

హుండీ ఆదాయంలో సమకూరుతున్న బంగారం, అలాగే భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారం అమ్మవారి పేరిట బ్యాంకుల్లో మూలుగుతోంది.ఈ బంగారం దాదాపు 20 కిలోలకుపైగా ఉన్నట్లు సమాచారం. అమ్మవారి మూలవిరాట్ కు ఉన్న కిరీటాన్ని తొలగించి బ్యాం కుల్లో మూలుగుతున్న బంగారంతో విజయవాడ కనకదుర్గ మాదిరి జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఏడు వారాల నగలు, ఒడిలో బంగారు వీణ, అలాగే కాళీ అమ్మవారికి బంగారు కిరీటం చేయించాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *