గీవేం చీరలు.. మాకొద్దు

Bathukamma Sarees No Quality

దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరలపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే బతుకమ్మ చీరలను పంట చేలకు రక్షణగా, ఇంటి ప్రహరీగా వాడిన సంఘటనలు బయటకు వచ్చాయి. అయితే బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ, మరికొన్ని ప్రాంతాల్లో తమకు చీరలు అందలేదంటూ ఆగ్రహించి మహిళలు ఆందోళనకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల బతుకమ్మ చీరలను బొంతలుగా మార్చి వాడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా భద్రాద్రి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. కొంతమందికే చీరలు పంపిణీ చేశారని మహిళలు రోడెక్కారు. దాంతోపాటు ములుగు జిల్లా మంగపేటలోని పొద్మూరు కాలనీలో ఓ మహిళ అయితే.. బతుకమ్మ చీరను ఏకంగా కర్టెన్‌గా వాడింది.  బతుకమ్మ చీర కోసం కూలైన్‌లో నిలబడ్డ ఓ మహిళ నీరసించి సొమ్మసిల్లి పడిపోయిన ఘటన కొత్తగూడెంలో జరిగింది. బతుకమ్మ చీరలు క్వాలిటీ లేవని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *