స్పీకర్ ను కలిసిన భట్టి బృందం అందుకేనా ?

Spread the love

Batti Group meet the Speaker ?

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా చావు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ మారరు అని భావించిన నేతలు సైతం పార్టీ మారుతున్న తీరు కాంగ్రెస్ పార్టీని కుదేలు చేస్తుంది. ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా పార్టీ ఫిరాయించే నేతలు కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఇక ఈనేపధ్యంలో స్పీకర్ ను కాంగ్రెస్ నేతల బృందం కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తెలంగాణ రాష్ట్ర సమితిలో సీఎల్పీని విలీనం చేస్తారనే ప్రచారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. బాన్సువాడ వెళ్లి స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ బృందం కలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించారని సభాపతిని భట్టి కోరారు. కారెక్కుతున్న గతంలో ప్రకటించిన ఆరుగురిపై, తాజాగా మరో నలుగురిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *