జగన్ కు లేఖ రాసిన భట్టి

Spread the love

Batti Vikramarka Letter to Jagan

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని పూర్తిచేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఉత్తర తెలంగాణా వర ప్రదాయినిగా ఈ ప్రాజెక్ట్ ని కెసిఆర్ సవాలుగా తీసుకోని పూర్తిచేశాడు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టిన కానీ, వాళ్ళని ఒప్పించి మరి ప్రాజెక్ట్ పూర్తిచేసి ఈ నెల 21 ప్రారంభించటానికి అన్ని సిద్ధం చేసుకొని, అటు మహారాష్ట్ర సీఎంని, ఇటు ఆంధ్ర సీఎం జగన్ ని ప్రత్యేక అతిధులుగా పిలవటం జరిగింది.
తాజాగా దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి ఖర్చులు పెంచారు. అలాగే టెండర్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి టెండర్లు వివరాలు అన్ని జ్యూడిషియల్ కమిషన్ ముందు పెట్టాలి. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెండర్ల వివరాలు జ్యూడిషియల్ ముందు పెడుతానన్నాడు అది చాలా గొప్ప విషయం. నేను దానిని సమర్దిస్తున్నాను. అతనిని చూసి కూడా కెసిఆర్ నేర్చుకోవాలి.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కి జగన్ ముఖ్య అతిధిగా వస్తే వాళ్ళ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుందని చెపుతూ జగన్ కి భట్టి విక్రమార్క లేఖ రాయటం జరిగింది. అదే విధంగా కెసిఆర్ పాల్పడిన అక్రమాలకు,ప్రాజెక్టు ఆకృతి మార్పు, అవకతవకలకు జగన్ కూడా పరోక్షంగా బాధ్యులు అవుతారని వివరించారు.. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ రాకూడదు అంటూ లేఖ రాశారు . ఒక వేళ వస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. తీవ్ర మైన పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పటం ,కెసిఆర్ అక్రమాలకు పరోక్షంగా బాద్యులు అవుతారని చీపారు. ఈ నేపధ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *