సాగర తీరం.. లాంచీ ప్రయాణం

4
Beautiful Nagarjuna Sagar Trip
Beautiful Nagarjuna Sagar Trip

Beautiful Nagarjuna Sagar Trip

కరోనా టైంలో ఒకే గదికి పరిమితమైపోయారా… వర్క్ ఫ్రం అంటూ గంటల గంటలు పనిచేస్తున్నారా… లాక్ డౌన్ రూల్స్ వల్ల ఎంజాయ్ చేయలేక తెగ ఫీల్ అవుతున్నారా… అయితే వెంటనే నాగార్జున సాగర్ కు టూరేయ్యండి మరి. అలలను ఆస్వాదిస్తూ.. లాంచీ లో సాగర్ అందాలను తనివితీరా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. లాంచీ ఎక్కి సాగర్ మొత్తం విహరించవచ్చు.

అన్ లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా టూరిజం శాఖకు అనుమతి ఇవ్వడంతో సాగర్ లో మళ్లీ లాంచీల సందడి మొదలైంది. టూరిస్టుల కోసం మొత్తం మూడు లాంచీలు సిద్ధంగా ఉన్నాయి. టికెట్ ధరలు పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 70 రూపాయలు. అంతేకాదు.. సాగర్ క్రస్టుగేట్లు కూడా ఎత్తేయడంతో జలపాతాల అందాలను ఆస్వాదించవచ్చు.