బెల్లంకొండకి ఈ క‌క్కూర్తి బుద్ధి ఎందుకో.!

Spread the love
Bellamkonda was bad minded

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఇప్పుడు మ‌రో చిత్రంతో ముందుకొస్తున్నాడు. త‌మిళంలో విజ‌యం సాధించిన రాచ్చ‌సన్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. నిజానికి, థ్రిల్ల‌ర్ క‌థాంశం. త‌మిళ చిత్రంలో అన్నీ ప‌క్కాగా కుదిరాయి. స్క్రీన్ ప్లే, న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్‌, ఆర్‌.ఆర్‌. బాగా కుదిరాయి, దాంతో అక్క‌డ పెద్ద హిట్‌. ఇప్పుడు అదే మేజిక్ కి తెలుగులో రిపీట్ చేయాల‌ని… మ‌క్కీకి మ‌క్కీగా త‌మిళ మాతృక మాదిరిగానే రాక్ష‌సుడుని తెర‌కెక్కించార‌ట‌. ఇది పేరుకు మాత్ర‌మే రీమేక్ అనీ, చాలా షాట్స్‌… ముఖ్యంగా విల‌న్ స‌న్నివేశాల‌ను తెలుగులో షూటింగే చేయ‌లేద‌ని అంటున్నారు! త‌మిళంలో తీసిన ఫుటేజ్ ని చాలాచోట్ల య‌థాత‌థంగా వాడేశారని అంటున్నారు. అందుకే, ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా అయిపోయింద‌ట‌! అయితే, ఫైటింగుల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి మాత్రం తెలుగు స్టాంపింగే ఉండాల‌ని హీరో ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌!

త‌మిళంలో రాచ్చ‌స‌న్ ఫైట్లు చాలా రియ‌స్టిక్ గా ఉంటాయి. అక్క‌డ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కి మంచి పేరు వ‌చ్చింది. అంత‌కుముందు, ఉరిఅడి అనే త‌మిళ సినిమా ఫైటింగుల‌తో ఆ మాస్ట‌ర్ కి పిచ్చ క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు, సూర్య సినిమాకి ఫైటింగులు కంపోజ్ చేస్తున్నాడు. దీంతో, ఆయ‌న్నే తెలుగులో కూడా ఫైటింగ్స్ చేయాలంటూ పిలిచారు. అయితే, మ‌న హీరోల‌కి అంత స‌హ‌జ‌త్వం న‌చ్చ‌దు క‌దా! బెల్లంకొండ విష‌యంలోనూ అదే జ‌రిగిందిట‌. త‌మిళ మాతృక మాదిరిగానే ఫైట్ల‌ను రియ‌లిస్టిక్ గా కంపోజ్ చేస్తుంటే… అబ్బే, వ‌ద్దు మాస్ట‌ర్‌, మ‌న‌కు ఇలా వ‌ద్దు, క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ కావాల‌ని హీరో అడిగాడ‌ట‌. అంటే, కోడితే అద్దాలు ప‌గిలిపోవ‌డం, సునామీలూ భూకంపాలు రావ‌డం, భారీ శాల్తీలు కూడా దూదిపిందెల్లా గాల్లోకి లేవ‌డం… ఈ త‌ర‌హా అన్న‌మాట‌! బెల్లంకొండ అస‌లే యాక్ష‌న్ హీరో కాబ‌ట్టి, బాబుకి ఇలానే ఉండాల‌ని చిత్ర యూనిట్ లో కొంత‌మంది చెప్పేస‌రికి… ఒక ఫైట్ తో మ‌మ అనిపించేసి, చెన్నైకి చెక్కేశాడ‌ట స‌ద‌రు ఫైట్ మాస్ట‌ర్‌. వాస్త‌వం మాట్లాడుకుంటే… బెల్లంబాబుకి సాలిడ్ హిట్ ఎక్క‌డుంది చెప్పండి..? ఏం… కాస్త‌ రియ‌స్టిక్ గా ట్రైచేస్తే కాస్త కొత్త‌గా అయినా క‌నిపించేవాడు క‌దా!

BellamKonda Sia Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *