ఏపీలో బెట్టింగ్ ల లొల్లి

Spread the love

Betting Issues in Andhra Pradesh

ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు అవుతున్నా ఏపీ లో మాత్రం పొలిటికల్ హీట్ తగ్గలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జోరుగా సాగిన బెట్టింగ్స్ తాలూకూ లావాదేవీలు అరాచకాలకు దారి తీస్తున్నాయి. పందెం డబ్బులు ఇవ్వాలంటూ మధ్యవర్తులపై ఒత్తిడి తెస్తున్నారు.ఆ పార్టీ.. ఈ పార్టీ గెలుస్తుందని పందెం కాసిన వారు.. ఆ డబ్బు ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్ అనో.. బంధువు అనో.. ఇంకేదో చుట్టరికం అనో.. నమ్మకస్తుడనో పందెం కట్టారు. ముందుగా డబ్బులు తీసుకున్న వారు కొందరు అయితే.. మరికొందరు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. తీరా ఫలితాల తర్వాత అందరి అంచనాలు తారుమారు అయ్యాయి.ఈ క్రమంలోనే లావాదేవీల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయారు. పందెంలో కాసిన డబ్బులు ఇవ్వాలంటూ దాడులకు దిగారు. ఎన్నికల్లో టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య రూ.7 కోట్లు పందెం జరిగింది.మధ్యవర్తిని పెట్టుకుని బెట్టింగ్ పెట్టారు. ఓ వర్గం చిత్తుగా ఓడిపోయింది. అంత డబ్బు ఒకేసారి ఇవ్వాల్సి రావటం, చేతిలో డబ్బు లేకపోవటంతో పత్తాలేకుండా పోయింది ఓడిపోయిన వర్గం. పందెంలో నెగ్గినవారు మాత్రం మధ్యవర్తిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన వారు.. ఇప్పుడు ఒత్తిడి పెంచుతున్నారు.ఇంకెన్నాళ్లు ఆగాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఓడిన వారి దగ్గర నుంచి రూ.7 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని మధ్యవర్తి ఇంటిపై అర్థరాత్రి దాడికి దిగారు. దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. తమ డబ్బులు ఇప్పించకుంటే.. చంపేస్తామంటూ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిపై బెదిరింపులకు దిగారు.ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని బాధిత కటుంబసభ్యులు వాపోతున్నారు. బెట్టింగ్ లతో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకోగా.. కొన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇదంతా ఇల్లీగల్ గా జరగటం, నమ్మకం, విశ్వాసంపై ఆధారపడటంతో పోలీసులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. రెండు వర్గాల మధ్య ఎలాంటి రాతపూర్వక ఒప్పందాలు ఉండవు. అలా అని చూస్తూ ఉండలేక పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇలా బెదిరింపులకు , దాడులకు పాల్పడితే కేసులు నమోదు చేసి బాధితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *