ఏపీలో బెట్టింగ్ హంగామా

Betting Season Running on Andhra Pradesh

జగన్ మెజార్టీ బాబు , లోకేష్ ఇద్దరి మెజార్టీ కంటే ఎక్కువ

ఏపీలో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి . ఐతే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందనే ఆసక్తి ఏ స్థాయిలో ఉందో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి కూడా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అదే స్థాయిలో ఉంది. ఈసారి ఏపీలో ఎన్నికల్ని ప్రధాన పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఎవరు అధికారం చేజిక్కించుకుంటారో అర్ధం కాని పరిస్థితి .వైకాపా అధినేత జగన్ ఈసారి సీఎం కావడం పక్కా అని కొందరంటుంటే టీడీపీదే మళ్ళీ అధికారం అంటున్నారు మరికొందరు. . ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో బెట్టింగ్ రాయుళ్లు చాలా యాక్టివ్ గా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పందేలు కాస్తున్నారు . ఏపీ ఎన్నికల మీద తెలంగాణలో సైతం బెట్టింగ్ సాగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఎన్నికల ఫలితాల గురించే కాక.. ఒక్కో నియోజకవర్గం మీద కూడా పందేలు నడుస్తున్నాయి. అభ్యర్థుల మెజారిటీల మీద కూడా ఫ్యాన్సీ బెట్టింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందులలో జగన్ మెజారిటీ మీద అందరి దృష్టీ నిలిచి ఉంది. ఈసారి అక్కడ రికార్డు స్థాయి మెజారిటీ ఖాయమంటున్నారు. అటువైపు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ రాయుళ్లు జగన్ మీద ఉన్న నమ్మకంతో చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ మెజారిటీ కలిపినా వైకాపా అధినేత మెజారిటీ కంటే తక్కువ ఉంటుందనే ధీమాతో ఈ మేరకు బెట్టింగులు కాస్తుండటం విశేషం. లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ గెలుపు మీదే సందేహాలుండగా.. గెలిచినా పెద్ద మెజారిటీ ఉండదన్నది జగన్ అభిమానుల ధీమా. కాబట్టి జగన్ మెజారిటీ.. చంద్రబాబు లోకేష్ ఇద్దరి మెజారిటీ కలిపినా కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని పందేలు కాస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *