వైభవంగా రామయ్య కల్యాణం

BHADRADRI  SEETHA RAMA KALYANAM.. నేడు రామయ్య పట్టాభిషేకం

సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది . ముక్కోటి దేవతలు కనులారా చూసి తరించేలా , సమస్త జీవరాశి సుఖ శాంతులతో జీవించేలా , లోక కల్యాణం కోసం స్వామీ కల్యాణం జరిగింది .ఆదివారం నాడు అభిజిత్ లగ్నాన సుగుణాలరాశి సీతమ్మను పరిణయమాడిన శ్రీరామచంద్రుడు నేడు పట్టాభిషిక్తుడు కానున్నాడు. భద్రాద్రిలో అంగరంగవైభవంగా పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించిన మిథిలా స్టేడియంలోనే ఈ క్రతువు నిర్వహించనున్నారు.

త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రచలంలో కూడా ఆ తంతు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ రాముడికి పట్టాభిషేక సమయంలో రామదాసు చేయించిన నగలను అలంకరించడం భద్రాద్రిలో ఆనవాయితీగా వస్తోంది. అర్చకులు స్వర్ణఛత్రం, స్వర్ణ పాదుక, రాజ దండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం తదితర ఆభరణాల విశిష్టతను భక్తులకు వివరిస్తూ స్వామివారికి అలంకరిస్తారు. ఏటా స్వామివారి కల్యాణం మరుసటి రోజున నిర్వహించే పట్టాభిషేక సమయంలో స్వర్గను పారాయణం చేస్తారు.

భద్రాద్రి రాముడి పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *