భజరంగి-2 అంటూ గర్జించిన శివరాజ్ కుమార్

3
Bhajarangi-2 trailer
Bhajarangi-2 trailer

Bhajarangi-2 trailer

సౌత్ లో సీక్వెల్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. అలాగని ఇది అన్ని సినిమాలకూ వర్తించదు. కంటెంట్ ను బట్టి.. కథలను సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వర్కవుట్ అవుతాయి. అలాంటి కంటెంట్ తోనే త్వరలోనే కన్నడలో భజరంగికి సీక్వెల్ గా ఓ సినిమా రాబోతోంది. కెజిఎఫ్ లాంటి మేకింగ్ కనిపిస్తోన్నా.. ఇది కెజీఎఫ్ కంటే ముందే వచ్చిన సినిమాకు సీక్వెల్. పైగా ఫస్ట్ పార్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇక లేటెస్ట్ గా విడుదలైన ఈ భజరంగి -2 మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. భజరంగి.. 2013లో కన్నడలో విడుదలైన సినిమా. అక్కడ కరుణాద చక్రవర్తిగా, శివన్నగా పిలుచుకునే మెగాస్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమా ఇది. ఆ యేడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందీ చిత్రం. కొన్ని సూపర్ నేచురల్ పవర్స్ కు, సోషల్ ఎలిమెంట్స్ కు మధ్య సాగే ఇంట్రెస్టింగ్ పోరుతో సాగే కథ. శివరాజ్ కుమార్ అద్భుత నటనతో ఏకంగా అన్ని వెబ్ సైట్స్ లో నాలుగు వరకూ రేటింగ్ సంపాదించుకుని క్రిటిక్స్ ను సైతం మెప్పించిందీ చిత్రం. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి కదా.

ఇక భజరంగికీ సీక్వెల్ అన్న దగ్గర నుంచి శివణ్న ఫ్యాన్స్ లో రకమైన ఎగ్జైట్మెంట్ ఉంది. అందుకే ఏ మాత్రం తగ్గకుండా సింపుల్ గా అద్భుతం అనేలా కనిపిస్తోందీ భజరంగి -2 ట్రైలర్. భావన హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రుతి కీలక పాత్రల్లో నటిస్తుండగా ఫస్ట్ పార్ట్ లో నటించిన లోకి కూడా ఉన్నాడు. చాలా వరకూ పాత పాత్రలను దాటించి కనిపిస్తోన్న ఈ ట్రైలర్ మేకింగ్ పరంగాచూస్తే మెస్మరైజింగ్ గా ఉందనే చెప్పాలి. ప్రతి షాట్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. భజరంగి చూడని వారికి ఇది కెజీఎఫ్ లా కనిపిస్తోన్నా .. ఇందులో మేజర్ షాట్స్ ఫస్ట్ పార్ట్ లోనూ కనిపిస్తాయి. అంత కొత్తగా ఉంది కాబట్టే ఆ పార్ట్ సూపర్ హిట్ అయింది. మొత్తంగా కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన హర్ష డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తో శాండల్ వుడ్ లో సరికొత్త హీట్ ప్రారంభం అయిందనే చెప్పాలి.

cinema news