ఓటీటీలో మరో హిట్ ..?

4
Bhanumathi ramakrishna hit
Bhanumathi ramakrishna hit

Bhanumathi ramakrishna hit

థియేటర్స్ మూతపడ్డంతో చాలామంది సినిమా లవర్స్ కు ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. అయితే చాలామందికి ఆ ఎంటర్టైన్మెంట్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ తో పాటు కొత్తగా వచ్చిన తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా సైతం అలరించే ప్రయత్నం చేస్తోంది. దీంతో చాలా సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి. కానీ వీటి సక్సెస్ రేట్ మాత్రం ఆశించినంత గొప్పగా ఉండటం లేదు. అందుకు కారణం.. కంటెంటే అని వేరే చెప్పక్కర్లేదు. రీసెంట్ గా వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల మెప్పించింది. అలాగే 47 డేస్ సైతం ఓటీటీకి పాస్ అయిపోయి ఓకే అనిపించింది. ఈ క్రమంలో లేటెస్ట్ గా విడుదలైన సినిమా ‘భానుమతి రామకృష్ణ’. నవీన్ చంద్ర, సలోనీ లూత్రా జంటగా నటించిన ఈ ‘ఏజ్డ్ లవ్ స్టోరీ’కి ఆడియన్స్ చప్పట్లు కొడుతుండటం విశేషం. మామూలుగా ప్రేమకథలు అనగానే టీనేజ్ నుంచి ఓ పాతికేళ్ల లోపు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా ఈ కథ ముఫ్ఫైయేళ్లు దాటిని ఇద్దరి మధ్య నడుస్తుంది. అలాగే హీరో కంటే హీరోయిన్ పాత్ర డామినేటింగ్ గా కనిపించినా కన్విన్సింగ్ గా ఉండటం ఈ స్క్రిప్ట్ స్పెషాలిటీ.

అలాగే వైవా హర్ష కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ప్రధాన పాత్రల్లో నటించిన నవీన్, సలోనీల నటన సినిమాకు ప్రధాన బలంగా చెప్పొచ్చు. మామూలుగా ఇలాంటి కథలు ఇంతకు ముందుకూడా వచ్చాయి. కానీ వాటి నుంచి కూడా కాస్త ప్రత్యేకంగా చూపించడంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోటి సక్సెస్ అయ్యాడు అంటున్నారు. ఆహాలో ఈ మధ్య విడుదలైన సినిమాల కంటే ఇది చాలా బెటర్ అంటున్నారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా పెద్దగా హడావిడీ లేకుండా హైలీ యాంబిషన్స్ లేకున్నా హాపీగా లైఫ్ లీడ్ చేస్తోన్న అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ సడెన్ గా బ్రేకప్ చెబుతాడు. తను ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న టైమ్ లోనే విలేజ్ నుంచి ఆమె పనిచేస్తోన్న కంపెనీలోకి రామకృష్ణ అనే అమాయక కుర్రాడు ఎంటర్ అవుతాడు. మొదట్లో అతనంటే ఆమెకి పడకపోయినా.. తర్వాత సినిమా రూల్స్ ప్రకారం అతనికి పడిపోతుంది. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త ఎఫెక్టివ్ సీన్స్ రాసుకుంటే బావుండేదేమో అనిపించినా.. మైనస్ అని మాత్రం చెప్పలేం. మొత్తంగా టైటిల్ కు తగ్గట్టుగా చాలా నీట్ గా, హుందా అయిన ప్రేమకథతో వచ్చిన భానుమతి రామకృష్ణ ఓటీటీలో మరో విజయాన్ని నమోదు చేసినట్టే అంటున్నారు.

tollywood news