లండన్ లో భారత హైకమీషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత

Spread the love

HIGH TENSION IN FRONT OF BHARAT HIGH COMMISSION IN LONDON

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ నేపథ్యం ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులు భారతీయులపై దాడి చేశారు. భారత హైకమిషన్ ముందు చేపట్టిన ఆందోళనలు ఘర్షణకు దారి తీశాయి. యూకే బేస్డ్ కశ్మీర్, ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ఆందోళనలు చేపట్టారు. భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవర్సీస్ పాకిస్తాన్ వెల్ఫేర్ కౌన్సిల్ మద్దతుదారులు, ఇండియా సొసైటీ ఫ్రెండ్స్ మధ్య ఈ వివాదం జరిగింది. తమ జాతిపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *