సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి

BHAVISHYA VANI IN RANGAM

  • ప్రజలకు ఎలాంటి ఆపదా రానివ్వను
  • రంగంలో భవిష్యవాణి వినిపించిన అమ్మవారు

వర్షాల కోసం ఆశతో ఎదురుచూస్తున్న ప్రజలకు అమ్మవారు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని భరోసా ఇచ్చారు. సికింరదాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల సందర్భంగా సోమవారం ఆనవాయితీ ప్రకారం ‘రంగం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలతను ఆవహించిన అమ్మవారు.. భవిష్యవాణి వినిపించారు. గతేడాది బోనాల నిర్వహణలో పెదవి విరిచిన అమ్మవారు.. ఈ ఏడాది ఉత్సవాలు మాత్రం తనకు సంతోషం కలిగించాయని చెప్పారు. ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారని, వారు సమర్పించుకున్న ముడుపులను సంతోషంగా అందుకున్నానని తెలిపారు. వర్షాలు తప్పకుండా కురుస్తాయని భరోసా ఇచ్చారు. తన బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనన్నారు. తనకు పూజలెందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలని సూచించారు. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాని చెప్పారు. ‘‘గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. ఐదు వారాలపాటు పప్పు, బెల్లంతో శాఖలు సమర్పించండి. మారు బోనం తప్పకుండా సమర్పించండి.. మీకు ఎలాంటి ఆపద రానివ్వను’’ అని భవిష్యవాణి వినిపించారు.

TS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *