బిగ్ బాస్ -4..  యాంకర్ రిపీట్

Big boss-4 host

తెలుగులో ఎక్కువగా ఆకట్టుకున్న మొదటి రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఫస్ట్ సీజన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్ కు బ్లాస్టింగ్ రేటింగ్స్ వచ్చాయి. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. కానీ ఈ షో పై అనేక విమర్శలు వచ్చాయి.  నాని హోస్టింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదనే కమెంట్స్ వచ్చాయి. అలాగే ఆ సీజన్ అంతా రకరకాల గొడవలతో పెద్దగా ఆసక్తి లేకుండానే సాగిపోయింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకుని థర్డ్ సీజన్ కు నాగార్జునను తీసుకుని హోస్టింగ్ చేయించారు. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో చేసి ఉన్న నాగ్ కు ఇదేమంత పెద్ద టాస్క్ కాలేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 3 ఒక రకంగా బానే ఆకట్టుకుందని చెప్పాలి. ఇక త్వరలనే ఈ షో నాలుగో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేశారని చెబుతున్నారు. వీరిలో ప్రముఖంగా వినిపించిన పేర్లు మాజీ లవర్ బాయ్ తరుణ్ తో పాటు యాంకర్, సింగర్ మంగ్లీ(సత్యవతి)లతో పాటు తాజాగా బిత్తిరి సత్తి పేరూ వినిపిస్తోంది. అలాగే ఈ సారి కంటెస్టెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే రెండో సీజన్ నుంచే మొదలైన హోస్టింగ్ కన్ఫ్యూజన్ ఈ సారి కూడా వినిపించింది. అంటే ఈ సారి హోస్ట్ ఎవరు అని.

ఈ క్రమంలో చాలామంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ఈ సారి సమంత ఈ షోను హోస్ట్ చేయబోతోందనే వార్త కొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది. కానీ అది నిజం కాదు. బిగ్ బాస్ -4ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడు. యస్.. ఈ సారి కూడా నాగ్ కే ఓటు వేశారు నిర్వాహకులు. అయితే ముందుగా ఎన్టీఆర్ ను కూడా సంప్రదించారు. అతను కాదన్న తర్వాతే మళ్లీ నాగ్ తో ఓకే చేయించారు. సో.. ఈ సారి షో మరింత రక్తి కడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. ఓ వైపు బిగ్ బాస్ కు ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే ఈ సినిమా షూటింగ్ నూ పూర్తి చేస్తాడట. అయితే బిగ్ బాస్ విషయంలో కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు కూడా చాలానే తీసుకుంటున్నారు అని సమాచారం. సభ్యులకు ముందుగానే టెస్ట్ లు చేయబోతున్నారు. అటుపై వారానికోసారి వారందరికీ టెస్ట్ లు చేస్తూ.. టాస్క్ ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారట. మొత్తంగా బిగ్ బాస్ -4కు సమంత హోస్ట్ అనే మాట అబద్ధం. నాగార్జునే చేయబోతున్నాడు అనేది నిజం.

tv news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *