చంద్రబాబు ఇంటివద్ద బిగ్ ఫైట్

Big Fight In front of ChandraBabu House .. టికెట్ ఇవ్వాలని ఒకరు , వద్దని మరొకరు

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. టికెట్ కోసం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలవరం నియోజకవర్గం టికెట్ పంచాయితీ ఇరువర్గాల మధ్య బాహాబాహీకి దారి తీసింది. తమ నాయకుడికి కేటాయించాలని కొంతమంది..టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని మరో వర్గం. ఇలా ఇరువర్గాలు ఆందోళన చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లో కీలకంగా ఉంటోంది. ఎలక్షన్స్‌లలో వైసీపీ, టీడీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో మొడియం శ్రీనివాస్ టీడీపీ తరపున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మొడియంకు టికెట్ రాదని ప్రచారం జరిగింది. దీనితో ఆయన అనుచరులు మార్చి 13వ తేదీ బుధవారం బాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఎలాగైనా మొడియం శ్రీనివాస్‌కు టికెట్ కన్ఫామ్ చేయాలని నినాదాలు చేశారు.
ఆయనకు టికెట్ కేటాయిస్తే పక్కా ఓడించి తీరుతామని మరోవర్గం అక్కడకు చేరుకుని నినాదాలు చేసింది. నినాదాలు..అరుపులు..కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అవినీతికి పాల్పడుతూ కొంతమంది నేతలు మొడియంకు టికెట్ రాకుండా చూస్తున్నారని కొంతమంది నేతలు ఆరోపించారు. మరి బాబు ఇరువర్గాలను బుజ్జగించి ఎలా దారిలోకి తెచ్చుకుంటారో..మొడియంకు టికెట్ కన్ఫామ్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *