సనాఖాన్ సంచలన నిర్ణయం

Bigboos fame sanakhan quit movies

సినీ నటి సనా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమాకు దూరం కానున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా జీవితంపై తీవ్ర ఆలోచనల్లో ఉన్నట్టు తెలిపింది. ఇది జీవితానికి కీలక దశ అని, అసలు జీవితానికి పరమార్థం ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాననన్నారు. సినిమాలకు దూరమై, సమాజ సేవలో తరించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

డబ్బు, పేరు కోసమేనా ఈ జీవితమని తనలో తాను ప్రశ్నించుకున్నట్టు లేఖలో రాసింది. అవసరార్థుల కోసం.. నిస్సహాయుల కోసమే తన జీవితమని పేర్కొంది. చావును ఎదుర్కోక తప్పదా, చనిపోయాక ఏం జరుగుతుందనే ఈ రెండు ప్రశ్నలు  గత కొన్ని రోజులుగా తనను వేధిస్తున్నాయని తెలిపింది. సినీ ఇండస్ర్టీకి పూర్తి దూరమై సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేయనున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *