మొదటి వారం నుంచే బిగ్ బాస్-4

6
Bigboss-4 starts soon
Bigboss-4 starts soon

Bigboss-4 starts soon

బిగ్ బాస్.. తెలుగులో తొలి రియాలిటీ గేమ్ షో. ఇప్పటికే బాలీవుడ్ లో ఈ షో చాలా సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. దీని ద్వారా కొత్త టాలెంట్ వచ్చింది. టాలెంటెడ్ అనుకున్నవారి అసలు పస తెలిసింది. అలాగే కాంట్రవర్శీలు, కహానీలకు కొదవ లేకుండా వార్త స్రవంతుల్లో చాలా న్యూస్ కనిపిస్తూ వచ్చాయి. ఇలాంటి షో సౌత్ లోకి వస్తుందన్నప్పుడు చాలామంది ఎగ్జైట్ అయ్యారు. ఆ ఎగ్జైట్మెంట్ ను డబుల్ చేస్తూ ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తెచ్చారు. మొదటి ఎపిసోడ్ లో కాస్త తడబడ్డా తర్వాత అదరగొట్టాడు యంగ్ టైగర్. మొత్తంగా ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయింది. కానీ తర్వాత నానిని హోస్ట్ గా తీసుకున్నారు. అతను అంత రక్తి కట్టించలేకపోయాడు. పైగా చాలా అంటే చాలా చిరాకు గొడవలు జరిగాయి. ఆర్మీలంటూ హడావిడి చేసిన వారికే కిరీటం దక్కడం విమర్శల పాలైంది. ఇక థర్డ్ సీజన్ లో ఆల్రెడీ హోస్ట్ గా ఎక్స్ పీరియన్స్ ఉన్న నాగార్జున వచ్చాడు.

ఫస్ట్ సీజన్ అంత బెస్ట్ గా లేదు.. సెకండ్ సీజన్ అంత వరస్ట్ గా లేకుండా తనదైన శైలిలో గేమ్ షో ను నడిపించాడు నాగ్. త్వరలో నాలుగో సీజన్ మొదలవుతుంది. మామూలుగా ఫోర్త్ సీజన్ కు కూడా ఎన్టీఆర్ నే తీసుకోవాలని  చాలా ప్రయత్నించారు. కానీ అతను ఆర్ఆర్ఆర్ లో లాక్ అయి ఉండటంతో కుదరలేదు. దీంతో మళ్లీ నాగ్ తోనే వస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ను ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితిని బట్టి.. అందరికీ ఆల్రెడీ టెస్ట్ లు చేశారు. క్వారంటైన్ లో ఉంచారు. ఈ నెల 29నుంచి షో మొదలుకావాలి. కానీ వీరిలో కొందరికి ఇంకా క్వారంటైన్ పీరియడ్ ఉంది. అందుకే సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ సీజన్ సాయంత్రం 6 గంటల నుంచి డిస్నీ స్టార్ మాలో ప్రారంభం కాబోతోంది. ఇక కంటెంస్టెంట్స్ ఎవరనేది పూర్తి స్థాయిలో ఆ రోజే అందరికీ తెలుస్తుంది. మరి ఈ సీజన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

entertainment news