బిగ్ బాస్ -4 కంటెంస్టెంట్స్ వీళ్లే.. నా?

2
Bigboss-4 starts soon
Bigboss-4 starts soon

Bigboss contestants

బిగ్ బాస్.. తెలుగులో ఫస్ట్ రియాలిటీ షో. అంతకు ముందు కొన్ని రియాలిటీ షోస్ ఉన్నాయి. కానీ ఇలా అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసిన షో మాత్రం ఇదే. ఇందుకు ప్రధాన కారణం ఈ షోను హోస్ట్  చేసేది స్టార్ హీరోలు కాబట్టి. ఫస్ట్ సీజన్ లో ఎన్టీఆర్ ఇరగదీస్తే.. తర్వాత నాని కాస్త డల్ అనిపించుకున్నాడు. అటుపై మీలో ఎవరు కోటీశ్వరుడు ఎక్స్ పీరియన్స్ తో నాగార్జున సైతం మూడో సీజన్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సారి కూడా నాగార్జునే బిగ్ బాస్ -4ను హోస్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేస్తోన్నారు అంటూ కొందరి పేర్లు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. అందులో మాజీ లవర్ బాయ్ తరుణ్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే తను ఆ షోలో పాల్గొనడం లేదని తరుణ్ స్వయంగా చెప్పేశాడు.  అయితే ఈ సీజన్ త్వరలోనే ప్రారంభం అవుతుంది మా టివిలో టీజర్ కూడా వదిలాక ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

అప్పుడెప్పుడో మొదటి సినిమా అనే సినిమాతో పరిచయమై నాగార్జున బాస్ మూవీలో కనిపించిన బ్యూటీ పూనమ్ బజ్వా, హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్, ఐటమ్ గాళ్ హంసా నందిని, సింగర్ సునీత, ఫోక్ సింగర్ మంగ్లీ(సత్యవతి), నటుడు నందు(గీతా మాధురి భర్త), యాక్టర్ వైవా హర్ష, అఖిల్ సార్థక్, యామినీ భాస్కర్, యూ ట్యూబ్ ఫేమ్ మహాతల్లి, అపూర్వ, జబర్దస్త్ ఫేమ్ పొట్టి నరేష్, యూ ట్యూబ్ స్టార్ మెహబూబా దిల్ సే, ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్.. ప్రస్తుతం ఈ 15మంది పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. దాదాపు వీరిలో 90శాతం వరకూ బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉందంటున్నారు. ఏదేమైనా ఈ సారి మేల్ కంటే ఫీమేల్ కంటెస్టెంట్ అది కూడా చాలా హాట్ అనిపించుకున్న భామలు కూడా ఉండటంతో ఈ సీజన్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

bigboss news