కేంద్రం నిధులు కేసీఆర్ జేబులోకి

BJP Ex president Laxman comments on Kcr

రైతులను మోసం చేసే కేసీఆర్‌కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంలో ఉన్నాయని, దళారీలు, కమిషన్ ఏజెంట్లకు కొమ్ముకాసేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలకు కారణమవుతోన్న పత్తి పంటను కేసీఆర్ ప్రోత్సహించటం సరైంది కాదన్నారు. భూసార పరీక్షల కోసం కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 125 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు.

వ్యవసాయ చట్టంతో రైతుల ఆదాయం రెట్టింపవుతోందని పేర్కొన్నారు. రైతు తనకు నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం లభించిందని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టంతో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని, దేశ భవిష్యత్‌కు వ్యవసాయ చట్టం పునాది లాంటిదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *