గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రస్థానం ఇలా

BJP man Pramod Sawant to be Goa’s new Chief Minister

గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ పాండురంగ్ సావంత్ గత సీఎం పారికర్ లా నిరాడంబరంగా జీవించే వ్యక్తి . గోవా అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన ప్రమోద్ సావంత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగిన మీద పార్టీ పెద్దలు ప్రమోద్ సావంత్ కే పట్టం కట్టారు.
ఓ సాధారణ ఆయుర్వేదిక్ డాక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రమోద్ పాండురంగ్ సావంత్ రాజకీయ నేతగా ఎంతో దూరం ప్రయాణించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా పనిచేస్తున్న సావంత్.. ముఖ్యమంత్రి పదవి కోసం తన సహచర బీజేపీ నేతలు వినయ్ టెండూల్కర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొని ఎట్టకేలకు సీఎంగా ప్రమాణం చేశారు. దివంగత సీఎం మనోహర్ పారికర్ ఐఐటీ పట్టభద్రుడైతే.. సావంత్ వైద్య(ఆయుర్వేద)విద్యను అభ్యసించారు. గోవాలోని సాంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన 45 సంవత్సరాల సావంత్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం పుణెలోని తిలక్ మహారాష్ట్ర యూనివర్సిటీకి వెళ్లడానికి ముందు ల్హాపూర్‌లోని గంగా ఎడ్యుకేషన్ సొసైటీ ఆయుర్వేద వైద్య కళాశాల నుంచి ఆయుర్వేద, మెడిసిన్, సర్జరీలో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. పారికర్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయనను గొప్ప రాజనీతిజ్ఞుడిగా, మార్గదర్శిగా, పితృ సమానుడిగా పేర్కొంటూ సావంత్ ట్విట్టర్‌లో ఓ సంతాప సందేశాన్ని పోస్టు చేశారు. సావంత్ సతీమణి సులక్షణా సావంత్ గోవాలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *