బ్లాక్ మెయిలర్లతో అభివృద్ది జరుగదు

6
BJP POWER POLITICS
BJP POWER POLITICS

BJP POWER POLITICS

బీజేపీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంద‌ని.. చేతకాని చవటలు, దద్దమ్మలు కాబట్టే, సీఎం కేసిఆర్ ను విమర్శిస్తున్నార‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. పిచ్చి కూతలు మానుకోకపోతే, ప్రజల చేతిలో తగిన శాస్తి తప్పదని హెచ్చ‌రించారు. ఓట్ల కోసం బీజేపీ ప‌ట్ట‌భ‌ద్రుల్ని మభ్య పెడుతుంద‌న్నారు. అవాస్తవాలు మాట్లాడటం బీజేపీ పని అయిపోయింది అంతే తప్ప వాళ్ళతో ఒరిగేదేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. నిరుద్యోగులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ల ద్వారా లోన్లు మంజూరు చేస్తామ‌ని, కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామ‌న్నారు. నిరుద్యోగులకు, పట్టభద్రులకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నామ‌ని తెలిపారు.

TelanganaLiveNews