నిర్మలక్క మాంద్యం నుంచి గట్టెక్కిస్తుందా?

bjp steps to overcome recession
ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తిని ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత పరిస్థితిని మీడియాకు వివరించారు. గత త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి చేరడంతో ఆర్థిక నిపుణులు ఆందోళన చెందారు. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని భరోసా నిచ్చారు నిర్మలా సీతారామన్. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని నిర్మలా వివరించారు. అయితే ఎగుమతులపై పన్ను తగ్గింపుపై మాత్రం పునరాలోచన చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది వృద్ధి రేటు ఆశాజనంగానే ఉందని వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. క్రెడిట్ గ్యారంటీ స్కీంతో పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టైక్స్ టైల్ ఎగుమతుల కోసం కొత్త పథకం అమలులోకి తీసుకొస్తామని వివరించారు. వచ్చే ఏడాది నుంచి వస్త్ర ఎగుమతుల కోసం కొత్త పథకం అమలు చేస్తామని హామీనిచ్చారు.  షాపింగ్ మాల్స్ లో మెగా షాపింగ్ ఫెస్టివల్ పెడతామని .. ఇది ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని అంచనా వేశారు.ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఇండియా స్థానం మరింత మెరుగైందని .. భయపడాల్సిన పరిస్థితి ఏం లేదని చెప్పారు. ఆర్థిక రంగం బలోపేతం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకు ప్రభుత్వ బ్యాంకుల్లో వితరణ లాభిస్తోందని చెప్పారు.
FINANCE MINISTER
tags : slow down , finance minister, Nirmala Seetharaman , GDP, Exports, imports, tax

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *