ట్రబుల్ షూటర్ డి. కె. శివకుమార్ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్న బీజేపీ

Spread the love

BJP Was Concentrated and Focused on Anti BJP Leaders

బీజేపీ అధిష్టానం తమ వ్యతిరేకులపై పగబట్టినట్టు కనిపిస్తోంది. వారిపట్ల కక్షా రాజకీయాలకు పాల్పడుతున్నట్టు అనిపిస్తుంది . ఏదో ఒక సాకుతో వారిమీద ఈడీ, సీబీఐ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చెయ్యటమో , అరెస్టు చేయించడమో జరుగుతోంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మంత్రులు, ఇతర నేతల ఇళ్ళు , కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ, సీబీఐ, ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం బీజేపీ ఉచ్ఛులో చిక్కుకున్నారు. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. తన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవలసి వచ్చింది. ఇక ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డి. కె. శివకుమార్ కే ట్రబుల్ క్రియేట్ చేసింది బీజేపీ.

గత ఏడాది సెప్టెంబరులోనే ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. పన్ను ఎగవేశారని, కోట్లాది రూపాయల హవాలా లావాదేవీలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని వఛ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ఆదాయం పన్ను శాఖ గత సంవత్సరం బెంగుళూరులోని స్పెషల్ కోర్టులో చార్జి షీట్ రూపొందించింది. దాని ఆధారంగా ఈడీ కేసు దాఖలయింది. మంగళవారం ఆయనను అరెస్టు చేసిన ఈడీ.. ఎనిమిదిరోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరబోతోంది. ఢిల్లీలో శివకుమార్ కు చెందిన ఫ్లాట్ నుంచి రూ. 8. 59 కోట్ల సొమ్ము స్వాధీనానికి సంబంధించి ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హవాలా లావాదేవీలతో శివకుమార్ కు సంబంధం ఉందని ఆరోపిస్తున్న వారు.. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. గత నాలుగు రోజులుగా తమ విచారణలో ఆయన.. సరైన సమాధానాలు ఇవ్వలేదని, పైగా పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. మంగళవారం నాలుగోసారి ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద శివకుమార్ ను అరెస్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తనకు వారు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించడంతో ఆయన ఈడీ ఎదుట హాజరు కాక తప్పలేదు.

2017 లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకలోని ఓ రిసార్టులో ఉంచడం ద్వారా బీజేపీ నేతలు వారిని కలుసుకోకుండా చేశాడని శివకుమార్ మీద కమలం పార్టీ ఆగ్రహంగా ఉంది. అందువల్లే ఆ ప్రతీకారాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్ కమ్ టాక్స్ దాడులు, ఈడీ అరెస్టు వంటివి జరిగాయని అంటున్నారు. పైగా… కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కూడా. ఇదే సమయమని కాంగ్రెస్ నేత అయిన శివకుమార్… కాషాయ నాథుల ‘ లక్ష్యం ‘ గా మారారు.ఇక ఈడీ తన సోదరుడిని అరెస్టు చేసిన విషయం ఆయన తమ్ముడు డి. కె. సురేష్ కు మంగళవారం మధ్యాహ్నం వరకు తెలియదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో శివకుమార్ ని కలిసేందుకు ఆయన తమ్ముడిని అనుమతించారట. ఇంత కక్షా రాజకీయాలకు కమలనాథులు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.

India Series Against Windies

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *