బీజేపీలో చేరుతున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్?

BODHAN MLA SHAKIL JOINING BJP?

నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. బోధన్ఎమ్మెల్యే ఎంపీ అరవింద్‌తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది .ఇక తానూ ఎంపీ అరవింద్ తో అన్ని విషయాలను చర్చించినట్టుగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు.గురువారం నాడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ తో బోధన్ ఎమ్మెల్యే షకీల్ భేటీ అయ్యారు.అరవింద్ కుమార్ తో షకీల్ భేటీ కావడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.అరవింద్ తో భేటీపై షకీల్ స్పందించారు. సోమవారంనాడు తాను స్పందిస్తానని ఆయన ప్రకటించారు. అరవింద్ తో ఏ విషయాల గురించి చర్చించారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ మేరకు ఓ మీడియా ఛానల్‌ ప్రసారం చేసింది.

టీఆర్ఎస్ లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారనే విషయమై షకీల్ తో అరవింద్ ఆరా తీశారనే ప్రచారం సాగుతుంది.మంత్రి పదవి దక్కని కారణంగా ఇప్పటికే అసంతృప్తితో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యలు బహిరంగంగానే ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే నష్ట నివారణ చర్యలకు టీఆర్ఎస్ నాయకత్వం దిగింది. జోగు రామన్న, రాజయ్య, నాయిని నర్సింహ్మారెడ్డిలతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చించింది. బుధవారం నాడు అసంతృప్త నేతలు టీఆర్ఎస్ భవనంలో కేటీఆర్ తో సమావేశమయ్యారు.అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్న తరుణంలోనే షకీల్ బీజేపీ ఎంపీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

bodhan mla updates

 

Related posts:

కరోనాపై అవగాహన లేని కార్పొరేటర్?
దేశానికి తాళం.. 14వరకు లాక్ డౌన్
గచ్చిబౌలి స్టేడియం కరోనా క్వారంటైన్ కేంద్రం
ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *