‘బుక్ మై షో‘ లో కొత్త తెలుగు సినిమాలు?

3
BOOKMYSHOW NEW FILMS?

BOOKMYSHOW NEW FILMS?

ఇప్పటి తరానికి పెద్దగా అనుభవం లేదు కానీ.. ఓ పదేళ్ళ క్రితం.. కొత్త సినిమా రిలీజైతే…. టికెట్లు సంపాదించడం అంటే కష్టం. నానా తంటాలు పడి క్యూలైన్లలో నిలుచుంటే.. టికెట్ దొరుకుతుందో లేదో.. మన వంతు వచ్చేలోగా బుకింగ్ కౌంటర్ ను ఎక్కడ మూసేస్తాడోనని చివరిదాకా ఒకటే టెన్షన్ ఉండేది. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో రూపొందిందే “బుక్ మై షో.” ఎన్నో పెద్ద పెద్ద సంస్థల పోటీని తట్టుకొని.. విపరీతమైన ప్రజాదరణను పొందింది బుక్ మై షో. ఎప్పటికప్పుడు తమను తాము మార్చుకుంటూ.. ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రయాణం సాగిస్తోంది. ఇప్పుడు ‘బుక్ మై షో‘  కన్ను కొత్త సినిమాలపై పడింది. నేరుగా సినిమాలను విడుదల చేయనుందని సమాచారం. అంటే అమెజాన్ ప్రైమ్, ఆహా తరహాలో అన్నమాట. దేశంలో కరోనా విస్తరిస్తుండటం, థియేటర్లు తెరుచుకోకపోవడంతో ప్రేక్షకులు ఓటీటీని ఆశ్రయిస్తుండటంతో ‘బుక్ మై షో‘ కూడా త్వరలో ఓటీటీలో చేరుతోందని తెలిసింది. దసరా సందర్భంగా తెలుగు కొత్త సినిమాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రైమ్, ఆహాకు గట్టి పోటీ

కొరోనా నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోకపోవడం చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ అనగానే ఇప్పటివరకు మన ప్రైమ్, ఆహాలో మాత్రమే తెలుసు. అన్ని రకాల సినిమాలు, ఇతర కంటెంట్ చూసేవాళ్లం. ఇప్పుడు ‘బుక్ మై షో‘ కొత్త సినిమాలు రిలీజ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తుండటంతో చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే కనుక నిజమైతే కచ్చితంగా ‘బుక్ మై షో‘ ఆదరణ పెరుగుతుంది. ప్రైమ్, ఆహాకు పోటీ ఇచ్చినట్లవుతుంది. ఇప్పటివరకు టికెట్లకు పరిమితమై ‘బుక్ మై షో‘ లో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి.