టిష్యూ పేపర్ల కోసం ..పబ్ లో యువకులను చితకబాదిన బౌన్సర్లు

Spread the love

Bouncers Beaten Youngsters in Pub

పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి పబ్ కి వెళ్లిన యువకులను బౌన్సర్లు చితకబాదిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది.

పబ్ లో జరిగిన చిన్న సంఘటన చిలికిచిలికి గాలివానైంది. తొమ్మిది మంది యువకులు తీవ్ర గాయాల పాలు కావడానికి కారణమైంది. పబ్బుల్లోని ప్రైవేట్ సైన్యం పబ్ కు వచ్చిన యువకులను చితక్కొట్టింది . స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల కోసం కార్తీక్ రెడ్డి, నవీన్ శరత్చంద్ర, చంద్ర కిరణ్ రెడ్డి లు మరి కొందరు స్నేహితులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అన్నీ అమ్నీషియా పబ్ కి వెళ్లారు. ఇక వీరిలో కొందరు వాష్ రూమ్ కి వెళ్లిన సందర్భంలో టిష్యూ పేపర్ ను యూజ్ చేస్తుండగా కొన్ని టిష్యూ పేపర్లు కింద పడ్డాయి. ఇక దీన్ని గమనించిన బౌన్సర్లు ఆ యువకులను ప్రశ్నించారు. దీంతో యువకులకు బౌన్సర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదిరి చివరకు బౌన్సర్లు అంతా కలిసి యువకులను చితక బాదారు .

తీవ్ర గాయాలపాలైన యువకులు ఇక ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . పబ్ నిర్వాహకులపై, బౌన్సర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యువకులు ఫిర్యాదు మేరకు పోలీసులు పబ్ యజమాన్యాన్ని ,బౌన్సర్లను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *