బాల‌య్యతో హిట్ కొట్టాకే బోయ‌పాటికి..

Spread the love

BOYAPATI NEW MOVIE

మాంచి యాక్ష‌న్ ఓరియెంటెడ్ మాస్ సినిమాలంటే బోయ‌పాటి శ్రీను చిత్రాలే అనే స్థాయిని తెచ్చుకున్నాడా ద‌ర్శ‌కుడు. కానీ, అదే త‌ర‌హాలో… మాస్ సినిమాలంటే మ‌రీ ఇంత ఓవ‌రాక్ష‌నా అనే త‌ర‌హా ఇమేజీని కూడా విన‌య విధేయ రామ‌తో మూట‌గ‌ట్టుకున్నాడు బోయ‌పాటి. గ‌డ‌చిన సంక్రాంతికి విడుద‌లైన ఆ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది. ఆ దెబ్బ‌తో బోయ‌పాటి ఇమేజ్‌… ఆయ‌న సినిమాల్లో రౌడీల్లాగ ఢామ్ అని కింద‌ప‌డిపోయింది. అయితే, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ కాబ‌ట్టి, విన‌య విధేయ రామ కంటే ముందు కొన్ని క‌మిట్మెంట్స్ చేసుకున్నాడు కాబ‌ట్టి, కొన్ని సినిమాలు ఇప్పుడు బోయ‌పాటి చేతిలో ఉన్నాయి. వాటిలో ముఖ్య‌మైంది… ప్ర‌ముఖ బ్యాన‌ర్ గీతా ఆర్ట్స్ లో ఒక చిత్రం!

స‌రైనోడు సినిమాతో బ‌న్నీకి మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఇచ్చాడు బోయ‌పాటి. ఆ స‌మ‌యంలోనే గీతాలో మ‌రో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే, విన‌య విధేయ రామ ఫ‌లితం త‌రువాత‌.. ఆ సినిమా వెన‌క్కెళ్లిపోయింది. ఇప్ప‌ట్లో ఉంటుందా లేదా అనేది కూడా డౌటే! ఈలోగా, మ‌రికొన్ని ఆఫ‌ర్లు చేతికి వ‌చ్చినా… నంద‌మూరి బాల‌కృష్ణ కోసం బోయ‌పాటి ఎదురు చూస్తున్నాడు. నిజానికి, ఎన్నిక‌ల‌కు ముందే బాల‌య్య‌తో ఒక సినిమా ఉంటుంద‌ని భావించారు. ఆ స‌మ‌యంలో, ఎన్టీఆర్ బ‌యోపిక్ చేసే హ‌డావుడిలో బాల‌య్య ఉండిపోయారు. దీంతో, ఆ ప్రాజెక్టు ప‌క్క‌కి వెళ్లింది. ఇప్పుడు ఇత‌ర బ్యాన‌ర్ల‌లో ఒప్పుకున్న సినిమాలు ఉన్నా కూడా… ముందుగా బాల‌య్య తో మ‌రోసారి త‌న మార్కు హిట్ కొట్టాల‌ని బోయ‌పాటి ఎదురుచూస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన రెండు సినిమాలూ గ‌తంలో హిట్స్ క‌దా! ఇప్పుడు హేట్రిక్ కొడ‌తాన‌నీ, దాంతో కెరీర్ మ‌ళ్లీ స్వింగ్ లోకి వ‌చ్చేస్తుంద‌ని బోయ‌పాటి భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *