ఈ కారు ఖరీదు రూ.132 కోట్లు

Spread the love

BUGATTI NEW CAR

సాధారణంగా కారు కొనాలంటే ఎంత కావాలి? మోడల్ ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.35 కోట్లు వరకు వివిధ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఫొటోలో ఉన్న కారు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. అత్యంత వేగంగా ప్రయాణంచే కార్లను తయారుచేసే బుగాటి  ఈ సరికొత్త లగ్జరీ కారును ఆవిష్కరించింది. ఈ కారు రూ.132 కోట్లకు (16.5 మిలియన్ పౌండ్లు) అమ్ముడుపోయింది.  ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న మెటార్‌ షోలో ‘లా వోయర్‌ నోయర్‌’  పేరుతో దీన్ని బుగాటీ కంపెనీ ఆవిష్కరించింది. 16 సిలిండర్‌ ఇంజిన్ కలిగిన ఈ కారు.. అదిరిపోయే లుక్ తో చూపరుల మతి పోగొట్టింది. కేవలం ఒక్క కారును మాత్రమే తయారుచేసింది. దీనిని ఫోక్స్‌ వ్యాగన్‌ మాజీ ఛైర్మన్‌ ఫెర్డినాండ్‌ పీచ్‌ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక సమచారం మాత్రం లేదు.

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *