నివేదాకు ఇది బంపర్ ఆఫరే

1
bumper offer to Niveda
bumper offer to Niveda

bumper offer to Niveda

టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న పేరు వచ్చిన తర్వాత కూడా కొందరు పెద్ద హీరోల సినిమాల్లో చిన్న వేషాలు వేస్తుంటారు. కారణం.. పెద్ద సినిమాలైతే పెద్ద గుర్తింపు వస్తుందనుకుంటారు. కానీ చాలాసార్లు ఉన్న గుర్తింపుకు ఎసరు వస్తుంది. అలాంటి ఇబ్బందినే ఫేస్ చేసిన బ్యూటీ నివేదా పేతురాజ్. అయితే ఆ ఫేజ్ ను దాటి మళ్లీ ఓ చిన్న సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తోందీ బ్యూటీ. చూడగానే హోమ్లీ బ్యూటీ అనిపించే భామ నివేదా పేతురాజ్. అఫ్ కోర్స్ ఆఫర్ ను బట్టి హాట్ గానూ ఆకట్టుకుంటుంది. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మధురై సోయగం.. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచెవారెవరురా సినిమాల్లో మంచి పాత్రలు చేసింది. తర్వాత అల వైకుంఠపురములో అంతగా ప్రాధాన్యం లేని పాత్రలో గ్లామర్ షోతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ సరసన నటించిన రెడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళ్ లోనూ బిజీగానే ఉంది. ఈ టైమ్ లో తనతో ఓ ప్రామిసింగ్ డైరెక్టర్ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాడు. కార్తికేయతో తెలుగులో తనదైన ముద్రవేసిన దర్శకుడు చందు మొండేటి.. తర్వాత ప్రేమమ్ తో హిట్ అందుకున్నా సవ్యసాచితో ఫెయిల్యూర్ చూశాడు.

ప్రస్తుతం కార్తికేయకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు. కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. ఈ లోగా ఓ కామెడీ థ్రిల్లర్ కథను తయారు చేసుకున్నాడు. నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో రూపొందే ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. థ్రిల్లర్ సినిమా అనగానే ఎక్స్ పెక్ట్ చేసే అంశాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. విశేషం ఏంటంటే.. కేవలం ఇరవై రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేస్తారట. ఈ బుధవారం నుంచే సెట్స్ పైకి వెళుతున్నారు. కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు అన్నీ తీసుకుని షూటింగ్ చేయబోతున్నారు. అలాగే సినిమాను థియేటర్స్ కోసమే అని కాకుండా పూర్తిగా ఓటిటి టార్గెట్ గానే రూపొందిస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా చందూ మొండేటికి కార్తికేయ-2 విషయంలో కాస్త టైమ్ దొరకడంతో ఈ సినిమా చేస్తున్నాడు. మరి ఈ మినీ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

tollywood news