అల్లు అర్జున్ మళ్లీ సంక్రాంతినే టార్గెట్ చేశాడు

4
bunny helps pawan fans
bunny helps pawan fans

bunny eyes in sankranthi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో తర్వాత ఆచితూచి అడుగులు వేస్తాడు అనుకున్నారు చాలామంది. ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా పాటలతో పాటు అల్లు అర్జున్ కు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను పెంచుకుంటూ తర్వాత ప్యాన్ ఇండియన్ మూవీతో రావాలనుకున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు సుకుమార్ తో ‘పుష్ప’ చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసినా.. వచ్చే సమ్మర్ వరకూ షూటింగ్ జరపాల్సి ఉంటుంది. అందుకు కారణం సినిమా మాగ్జిమం అడవుల్లోనే చిత్రీకరణ చేయాలి. ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్నాయి. అందువల్ల అడవుల్లో చిత్రీకరణ సాధ్యం కాదు. జనవరి తర్వాతే కుదురుతుంది. ఈ లోగా ఇతర పార్ట్ అంతా(అది కూడా లాక్ డౌన్ ఎత్తేస్తే) షూట్ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘ఐకన్’మూవీ చేస్తాడు అనుకున్నారు  చాలామంది. కానీ అటు దిల్ రాజుతో పాటు దర్శకుడికీ షాక్ ఇస్తూ కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశాడు. నిజానికి ఇది దిల్ రాజుకు తెలిసే జరిగిందా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. పైగా కొరటాల శివ సినిమాతో బన్నీ ఫ్రెండ్స్ నిర్మాతలుగా మారుతున్నారు. ఆ మేటర్ ఎలా ఉన్నా.. ఈ సినిమాతో మరోసారి అల వైకుంఠపురుములో మ్యాజిక్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. కొరటాల, అర్జున్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

అయితే కథ ప్రకారం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. హీరో ఆంధ్ర యూనివర్శిటీలో పిహెచ్.డి స్టూడెంట్ గా ఉంటాడు. అలాగే విద్యార్థి నాయకుడు కూడా. లోకల్ గా వచ్చిన పరిశ్రమల వల్ల కలుషితమైపోతోన్న పర్యావరణాన్ని కాపాడుతూ.. చాలామంది పెద్దవారితో పెట్టుకుంటాడు అంటున్నారు. మొత్తంగా ఈ పోస్టర్ కూడా దాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఆ పోస్టర్ లోనే మరో విషయం కూడా వుంది. ‘ఎర్లీ 2022’అని. అంటే పుష్ప సినిమా వచ్చే సమ్మర్ వరకూ పూర్తయినా.. అదే టైమ్ వరకూ కొరటాల చిరంజీవితో ఆచార్యను ఫినిష్ చేస్తాడు. అప్పటి నుంచి మొదలైతే.. ఆ తర్వాతి యేడాది అంటే 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం చాలా క్లియర్ గా ఉంటుంది. ఒకవేళ పుష్ప సినిమా ఆలస్యం అయినా కొరటాల సినిమాను సులువుగానే సంక్రాంతి బరిలో నిలిపేయొచ్చు. మొత్తంగా ఈ సంక్రాంతికి రికార్డ్స్ క్రియేట్ చేసి.. నెక్ట్స్ సంక్రాంతిని మిస్ చేసుకున్నా.. ఆ తర్వాత మళ్లీ వదలడం లేదన్నమాట. ఏదేమైనా అల్లు అర్జున్ .. ఆచితూచి కాకుండా కాస్త దూకుడుగానే వెళుతున్నాడని చెప్పొచ్చు.

tollywood news