అల్లు అర్జున్ కొత్త ‘యాత్ర’?

2
bunny helps pawan fans
bunny helps pawan fans

Bunny with yatra Raghava?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో వంటి హ్యూజ్ హిట్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. మరోవైపు ఈ మూవీ అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. పాటల పరంగానో లేక వ్యూస్ పరంగానో రోజుకో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తోంది అల వైకుంఠపురములో. ఇక ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే పుష్ప మూవీకి వెళ్దామనుకున్నాడు. కానీ అనుకోని వైరస్ కారణంగా వచ్చిన లాక్ డౌన్ తో ఏకంగా పుష్ప సినిమా షూటింగ్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు అల్లు అర్జున్. కొన్నాళ్లు పూర్తిగా ఇంటికే పరిమితమైనా.. కాస్త సడలించిన నిబంధనలతో .. ఇతరులతో కూడా కలుస్తున్నాడు. ఆ క్రమంలోనే కొన్ని కొత్త కథలు వింటున్నాడట బన్నీ. ఈ మధ్య కొందరు సీనియర్, మీడియం రేంజ్ తో పాటు కొత్తవాళ్లు చెప్పిన కథలు కూడా విన్నాడట అల్లు అర్జున్. అయితే అందులో అందరికంటే.. యాత్ర మూవీ ఫేమ్ మహి వి రాఘవ చెప్పిన కథ బాగా నచ్చిందనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ‘హాఫ్ బయోపిక్’ గా వచ్చిన యాత్ర మంచి విజయాన్నే సాధించింది. ముఖ్యంగా రాఘవ దర్శకత్వం చాలామందికి నచ్చింది.

మమ్మూట్టి వంటి వర్సటైల్ యాక్టర్ ను తన స్క్రిప్ట్ తో ఒప్పించాడు అంటేనే రాఘవ ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు. యాత్రతో ఫేమ్ అయినా మహి వి రాఘవ అంతకు ముందు పాఠశాల అనే అద్భుత సినిమాతో మెప్పించాడు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రమోషన్స్ లేక జనాల్లోకి వెళ్లలేదు. తర్వాత తాప్సీ, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆనందో బ్రహ్మ’కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాతే అతను యాత్ర చేశాడు. మొత్తంగా ఇప్పుడు రాఘవ చెప్పిన కథ ప్లాట్ అల్లు అర్జున్ కు బాగా నచ్చిందని సమాచారం. అయితే దీన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మలిచి చూపితే అప్పుడు నిర్ణయం తీసుకుంటా అన్నాడట బన్నీ. మరి ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో కానీ.. ఖచ్చితంగా ఈ వార్త మాత్రం టాలీవుడ్ లోఇంట్రెస్టింగ్ గా మారింది.

tollywood news