ఏపీ క్యాబినెట్ భేటీ .. కీలక మంత్రులు డుమ్మా

Cabinate meeting In AP

అమరావతిలో సెక్రటేరియట్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ కేబినెట్ భేటీకి కేవలం నాలుగు శాఖల ప్రధాన కార్యదర్శులు మాత్రమే హాజరుకానున్నారు. వారితో ఫొని తుఫాన్, కరువు, తాగునీరు సాగునీరు, ఉపాధిహామీ పథకం వంటి నాలుగు అంశాలపై వారితో చర్చించనున్నారు.

ఇకపోతే ఈ కేబినెట్ భేటీకి కీలక మంత్రులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. అయితే సమాచారం ఆలస్యం కావడం వల్లే మంత్రులు రావడానికి వీలు కుదరలేదని టీడీపీ సమర్థించుకుంటుంది ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు విందు ఇవ్వడం సరికొత్త రాజకీయాలకు తెరలేపింది. ఏపీలో ఎన్నికల అనంతరం కేబినెట్ భేటీ అనేది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.

ఈ కేబినెట్ భేటీ వ్యవహారం సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంల మధ్య పెద్ద అగాధమే సృష్టించిందని చెప్పుకోవాలి. అంతేకాదు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు కేబినెట్ భేటీ ఎందుకంటూ అటు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేబినెట్ భేటీ నిర్ణయాన్ని సిఈసీ కోర్టులో నెట్టేసి తప్పించుకున్నారు. అయితే సిఈసీ 13 సాయంత్రం ఏపీ కేబినెట్ సమావేశానికి షరతలుతో కూడిన అనుమతి ఇచ్చింది. వెంటనే సీఎంవో కార్యాలయం మంత్రులందరికీ సమాచారం అందజేసింది.

అయితే కేబినెట్ భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు డిప్యూటీ సీఎంలు అయిన నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తిలతోపాటు మంత్రులు నారాలోకేష్, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు, శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, భూమా అఖిలప్రియ, నారాయణ, కొత్తపల్లి జవహర్‌, నక్కా ఆనంద్‌ బాబు, కళా వెంట్రావు, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *