ఫలితం ఇవ్వని తీగల వంతెన

5
Cable bridge Hyderabad
Cable bridge Hyderabad

Cable bridge Hyderabad

ఎప్పటిన్నుంచో వాయిదా పడుతు వస్తున్న కేబుల్ బ్రిడ్జి ప్రారంభం కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుండటటంతో తీగల వంతనను ప్రారంభించాలనుకుంది. ఎంతో అట్టహసంగా ప్రారంభించి లబ్ధి పొందాలనుకుంది. తీగల వంతెనను ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేసుకోవడం, అదే టైం లో ప్రముఖ గాయకుడు బాల సుబ్రమణ్యం మరణవార్త వెలువడటంతో నాయకులు, అధికారులు తూతూమంత్రంగా ప్రారంభించేశారు. తీగల వంతెనతో లబ్ధి పొందాలనుకున్న ప్రభుత్వానికి ఏమాత్రం ఫలితం లేకుండాపోయింది. తీగల వంతెనతోనే పరోక్షంగా జీహెచ్ ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలనుకుంది. పరిస్థితులు తారుమారు కావడంతో నేతల్లో గుబులు నెలకొంది. కోట్లు ఖర్చు పెట్టి ప్రారంభించిన వంతెన తెలంగాణ ప్రభుత్వానికి ఏ మాత్రం పేరు తీసుకురాలేకపోయింది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద ఉన్న దుర్గం చెరువుపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల ఖర్చుతో వంతెనను నిర్మించింది. అయితే, గత కొద్ది నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్న దీని ప్రారంభ కార్యక్రమం ఎట్టకేలకు నోచుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ కేటీఆర్ కలిసి ప్రారంభించారు. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జితో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం బాగా తగ్గనుంది. రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభిస్తుంది.