భారతీయులకు అమెరికాకు ప్రత్యామ్నాయంగా కెనడా

Spread the love

Canada is best place for Indian Instead of America .. ఎందుకంటే

అమెరికా వెళ్లాలనుకున్న భారతీయ ఔత్సాహికులకు ట్రంప్ దెబ్బతో బ్రేక్ లు పడ్డాయి. లక్షా తొంభై తొమ్మిది రూల్స్ తో, కఠినతరమైన నిబంధనల మధ్య అమెరికా వెళ్లి ,అక్కడ జాతి వివక్షను ఎదుర్కొనే కంటే ప్రత్యామ్నాయం చూసుకుంటే బెటరని చాలామంది ఇండియన్స్ భావిస్తున్నారు. ఇక అలాంటి భారతీయులకు ప్రత్యామ్నాయంగా, స్వర్గధామంగా కనిపిస్తోంది కెనడా. ఇక అమెరికా వద్దు కెనడా ఈ ముద్దు అని అంటున్నారు ఇండియన్స్.
ఈ మేరకు కెనడా బ్రాడ్ సర్వీస్ ఏజెన్సీ సీబీఎస్ఏ కి చెందిన ఇంటెలిజెన్స్ అండ్ ఎనాలిసిస్ విభాగం ఓ నివేదికను బయటపెట్టింది.2016తో పోల్చి చూస్తే కెనడాకు రావాలనుకునే భారతీయుల సంఖ్య ఏకంగా 310 శాతం పెరిగినట్టు సీబీఎస్ఏ వెల్లడించింది. 2016లో కేవలం 582 మంది కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకుంటే.. గతేడాది ఈ సంఖ్య 3లక్షల 10వేల మందికి పైగాపెరిగిందని నివేదిక స్పష్టంచేసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఇండియా నుంచి సిక్కు జాతీయులు ఎక్కువగా కెనడా వీసాల కోసం దరఖాస్తుచేసుకుంటున్నట్టు ప్రకటించింది సదరు సంస్థ. పంజాబ్ కు చెందిన ఎక్కువమంది సిక్కులతో పాటు హర్యానా , గుజరాత్, తమిళనాడు చెందిన ప్రజల వీసాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది.
భారీగా పెరుగుతున్న వలసలకు సంబంధించి తన విశ్లేషణను కూడా బయటపెట్టింది సీబీఎస్ఏ. భారత్ లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరగడంతో పాటు జనాభా, అవినీతి ,పరువు హత్యలు ఎక్కువయ్యాయని,దీనికి తోడు మహిళలపై లైంగిక వేధింపులుకూడా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీటిని పుష్ ఫ్యాక్టర్స్ గా పేర్కొన్న సంస్థ.. ఇక కెనడాలో పర్యావరణం బాగుండడంతో పాటు అనేక అవకాశాలు , విదేశీ వాణిజ్యం పెరగడం వంటిఅంశాల్ని పుల్ ఫ్యాక్టర్స్ గా పేర్కొంది.ఈ కారణాల వల్ల ఇండియా నుంచి ఎక్కువమంది ఆశ్రయం కోసం కెనడాకు వస్తున్నట్టు ఇంటిలిజెన్స్ అండ్ ఎనాలిసిస్ విభాగం ఓ నివేదికను వెల్లడించింది. ఈ మేరకు కెనడాకు వచ్చేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం ,ఫోర్జరీ చేయడం లాంటి నేరాలు కూడా ఇండియాలో ఎక్కువయ్యాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *