ఆ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త

Spread the love

CAREFUL WITH THESE APPS

  • వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్న పలు యాప్ లు
  • 29 ప్రమాదకర యాప్ లు తొలగించిన గూగుల్

మీ స్మార్ట్ ఫోన్ లో ఫొటో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయా? బ్యూటీ యాప్స్ కూడా వినియోగిస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. మీ వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరిపోయే ఛాన్స్ ఉంది. టెక్నాలజీకి తగినట్టుగానే నేరాలు కూడా స్మార్ట్ గా పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత మన డేటాను ఏదో విధంగా చోరీ చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. మన బ్యాంకింగ్ వివరాలు తెలుసుకోవడానికి, మెయిల్ ను హ్యాక్ చేయడానికి మన ఫోన్లోకే మాల్ వేర్ పంపించి తమ పని కానిస్తున్నారు. ఇందుకోసం మనం వినియోగించే యాప్స్ నే అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ భద్రతా చర్యలు చేపట్టింది. వినియోగదారుల డేటాను చోరీ చేస్తున్న 29 ఫొటో ఎడిటింగ్ యాప్స్ ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. వీటి ద్వారా యూజర్ల డేటాకు ప్రమాదం ఉందన్న నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఆసియాలో.. ముఖ్యంగా ఇండియాలో ప్రో కెమెరా బ్యూటీ, కార్టూన్ ఆర్ట్ ఫోటో, ఎమోజి కెమెరా వంటి యాప్స్‌ కొన్ని లక్షలకు పైగా డౌన్‌లోడ్‌ అవుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే  అంశమని పేర్కొంది. హానికరమైన ఈ యాప్స్‌ మాల్‌వేర్‌ను స్మార్ట్ పోన్లలోకి పంపిస్తున్నాయంటూ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ మైక్రో గుర్తించింది. ప్లేస్టోర్‌లోని బ్యూటీ కెమెరా యాప్స్ కీలకమైన సర్వర్లను యాక్సెస్ చేయగలదని పేర్కొంది. ప్రో కెమెరా బ్యూటీ, ఎమోజీ కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్‌డీ, ప్రిజ్మా ఫోటో ఎఫెక్ట్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ద్వారా యూజర్ల చిరునామాలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారని వివరించింది. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయగానే యూజర్లకు ఎలాంటి సందేహం రాకుండా.. గుర్తించలేనంతగా ఒక షార్ట్ కట్ ను కూడా క్రియేట్‌ చేస్తుంది. దీనివల్ల ఈ యాప్‌ను అన్ ఇన్ స్టాల్ చేయడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో అనవసరమైన యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోకుండా ఉండటమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

MOBILE NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *