ధోని గురించి ఆస్ట్రేలియా కీపర్ ఏమన్నాడు?

Carey Wants To Become Like Dhoni

టీం ఇండియా మంచి ఫామ్ లో ఉంది. వరుస విజయాలతో ర్యాంకింగ్స్ లోను సత్తా చాటుతుంది. తాజాగా టీం ఇండియా శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ సిరీస్ ని  కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటింది. అయితే ప్రస్తుతం టీం ఇండియా ఆస్టేలియాతో తలపడనుంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఇకపోతే టీం ఇండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ కొంతకాలంగా క్రికెట్ కి దూరంగా ఉంటున్నారు. చివరిగా ధోని వరల్డ్ కప్ సెమిస్ లో ఆడారు. అప్పటి నుంచి ధోని స్టేడియంలోకి అడుగుపెట్టలేదు. ఈ నేపథ్యంలో ఆస్టేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ క్యారీ మహేంద్ర సింగ్ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ‘నాకు ధోనీలా మారాలనుంది.  ధోని అద్భుతమైన ఫినిషర్. అదే విధంగా నేను కూడా ఆస్ట్రేలియాకు ఒక ఫినిషర్‌గా మారాలని అనుకుంటున్నాను’’ అని అన్నారు. దాని కోసం నా బ్యాటింగ్ ని మెరుగుపరుచుకుంటున్నా అంటూ ధోని ప్రతిభపై ప్రశంసలు కురిపించారు అలెక్స్‌ క్యారీ.  మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌ చేసే నైపుణ్యం తనలో ఉందన్న క్యారీ ఫ్యూచర్లో తాను ధోనీలా మారుతానని తెలిపారు.

India Vs Australia Series 2020

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *