జనసేన ఎమ్మెల్యే రాపాకపై పెట్టిన  కేసు..  పవన్ మండిపాటు 

Spread the love
Case against Janasena MLA Rapaka
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో  జనసేన ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించారు. ఈ క్రమంలో ఏకంగా ఆయనే వచ్చి రాజోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఎస్సై…ఏక వచనంలో మాట్లాడటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ ధర్నా నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ… ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైంది. కాగా..  ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల తరపున పోలీస్ స్టేషన్ కి వెళ్లిన ఎమ్మెల్యే రాపాకను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని పవన్ అభిప్రాయపడ్డారు.గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తీసుకువచ్చారని పవన్ పేర్కొన్నారు.
నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే  జర్నలిస్ట్ పై దాడికి ప్రయత్నిస్తే… ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే.. తాను రాజోలు వచ్చి పోరాడతానని పవన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ఎమ్మెల్యే పై 3 రోజుల కిందట కేసు నమోదైంది. ఓ గొడవ విషయంలో ఎస్ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాపాకతోపాటు.. జనసేన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేయాలని కూడా పోలీసులు భావించారు. ఈ క్రమంలో ఏకంగా ఆయనే వచ్చి రాజోలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు త్వరలో కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన అరెస్టు నేపథ్యంలో రాజోలులో పోలీసులు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *