కరోనా కి కారణం చైనా అధ్యక్షుడే

case filed against china president

కరోనాఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్  ప్రపంచమంతా వ్యాపిస్తోంది. వేలాదిమంది ప్రాణాలు పోయాయి. లక్షలాది మందికి వైరస్ సోకింది. ఇప్పుడీ ఈ వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ ఆ దేశా అధ్యక్షుడిపై కేసు నమోదు అయింది. వైరస్ వ్యాప్తిపై బిహార్‌కు చెందిన సుదీర్ కుమార్ అహుజా అనే న్యాయవాది.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఆ దేశ అంబాసిడర్ సన్ వెయిడంగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వైరస్ వ్యాప్తికి అనుమతినిచ్చారని ఆరోపిస్తూ సోమవారం ముజాఫ్ఫార్ పూర్ కోర్టును ఆశ్రయించారు. చైనా ఈ ప్రాణాంతక వైరస్ ను రహస్యంగా డెవలప్ చేస్తోందని, ఇప్పుడు అది ప్రపంచమంతా వ్యాపిస్తోందని 1981లో పబ్లిష్ అయిన బుక్ రివీల్ చేసినట్టు తెలిపారు. ప్రపంచంలో చైనా తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఈ అంటువ్యాధిని వ్యాప్తి చేస్తోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 11న విచారించనుంది.

మహమ్మారి  వ్యాప్తితో చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణించారని, ఇండియాలో కూడా మరణించారని కారణమైన జిన్ పింగ్, సన్ వెయిడంగ్ ఇద్దరిపై ఆయన కేసు వేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 11న విచారించేందుకు ఆమోదం తెలిపింది. ముందుగా చైనాలో కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాలను లాక్ డౌన్ చేసింది. కరోనా వ్యాప్తిని అదుపులో పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలను రద్దు చేసింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. 16 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఆదివారం నాటికి 14మంది మరణించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,860కు చేరుకోగా, 67వేల మంది కోలుకున్నారు.

tags: corona virus china, wuhan, malaysia, quarantine, jinping, veidang, sudheer kumar ahuja, mujaffarabad court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *