మొన్న శ్వేతా రెడ్డి నేడు గాయత్రీ గుప్తా

Spread the love

Case on big boss

బిగ్ బాస్ -3 సీజన్ ప్రారంభం కంటే ముందే వరుస వివాదాలతో సంచలనంగా మారింది. తొలిసారి ఈ రియాలిటీ షోకు ప్రముఖ నటుడు నాగార్జున ప్రయోక్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నీమధ్యనే శ్వేతారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు గందరగోళం నుంచి బయటకు రాకముందే.. తాజాగా గాయత్రి గుప్తా అనే యూట్యూబ్ స్టార్ చేసిన ఆరోపణలు మరింత మంట పుట్టేలా ఉన్నాయని చెప్పాలి. బిగ్ బాస్ షోను నిర్వహిస్తున్న స్టార్ మాకు చెందిన కీలక ఉద్యోగులు తమతో అనుచితంగా వ్యవహరించటంతో పాటు.. వారెలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసా? అంటూ ఫిర్యాదులు చేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న నటి శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా ఆ జాబితాలో యూట్యూబ్ సంచలనం కమ్ నటి గాయత్రీ గుప్తా కంప్లైంట్ చేశారు.

షో నిర్వాహకులు తనతో అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఆమె పేర్కొన్నారు. శ్వేతారెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె.. బిగ్ బాస్ షో నిర్వాహకుల మీద ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోలో నటించేందుకు సిద్ధమా? అని రఘు అడిగారని.. 100 రోజులు బిగ్ బాస్ లో ఉండాల్సి వస్తుందని.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలన్న మాటను చెప్పారన్నారు. ఆ సందర్భంగా వంద రోజులు సెక్స్ కు దూరంగా ఉండగలవా? అని ప్రశ్నించినట్లు చెప్పారు. అన్నింటికి దూరంగా ఉండాలంటూ.. ఇంత దారుణంగా మాట్లాడారన్న ఆమె.. తనను సెలెక్ట్ చేసినట్లు మొదట చెప్పారన్నారు. ముంబయి నుంచి వచ్చిన అభిషేక్ తో పాటు రఘు.. రవికాంత్ లు తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయించారన్నారు.

ఆ తర్వాత తమ పై వాళ్లను ఎలా సంతృప్తి పరుస్తారని అడిగారని.. ఇలా ఎలా అడుగుతారని తాను ఘాటుగా బదులిచ్చినట్లు చెప్పారు. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి తాను సెలెక్ట్ కాలేదని చెప్పారన్నారు. బిగ్ బాస్ షోలో ఎంపికైనందుకు.. ఆ షెడ్యూల్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తాను ఆరు సినిమాల్లో అవకాశాల్ని మిస్ చేసుకున్నట్లు చెప్పారు. బిగ్ బాస్ నిర్వాహకుల తీరుతో భారీఆర్థిక నష్టంతో పాటు.. లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గాయత్రి గుప్తా నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. తగిన విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఒకటి తర్వాత ఒకటిగా బిగ్ బాస్ -3 మీద నమోదవుతున్న కేసులు స్టార్ మాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా చెప్పాలి. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు తెర మీదకు వస్తాయో చూడాలి.

Bigg boss strategy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *