దేశవ్యాప్తంగా187 ప్రాంతాలలో  సిబిఐ దాడులు

CBI attacks in 187 locations across the country
దేశవ్యాప్తంగా  వైట్ కలర్ నేరాలకు పాల్పడిన  ఆర్థిక నేరగాళ్ళపై సిబిఐ కొరడా ఝుళిపించనుంది.  దేశవ్యాప్తంగా  పలు ప్రాంతాలలో ఇప్పటికే సిబిఐ దాడులు కొనసాగిస్తోంది. బ్యాంక్ ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం  మోపనున్న  నేపథ్యంలో. రూ.7200కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా  దాడులు ప్రారంభించింది. మొత్తం 187 ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మంది అధికారులు దాడులు చేశారు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చండీగడ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా, నగర్ హవేలి, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఈ సంవత్సరంలో జరిగిన అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా ఈ దాడులను భావిస్తున్నారు. కాగా రూ7వేల కోట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా 42 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దాడులు చేసి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  ఇక తాజాగా  జరుగుతున్న సిబిఐ దాడులతో  పలు రాష్ట్రాలలో  టెన్షన్ నెలకొంది.

tags : fraud cases, banking frauds, cbi raids, 187 places, 1000 officials , 15 states , delhi, kerala

http://tsnews.tv/chandrababu-preparing-for-initiation-on-november-14/
http://tsnews.tv/sit-report-on-the-death-of-cows-at-vijayawada/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *