జనసేనలోకి లక్ష్మీనారాయణ

Spread the love

CBI EX JD JOINS IN JANASENA

  • సీబీఐ మాజీ జేడీని పార్టీలోకి ఆహ్వానించిన పవన్
  • విశాఖ ఎంపీగా బరిలోకి దిగే అవకాశం

మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరారు. రాజకీయాల్లోకి రావడం కోసం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఆయన.. తొలుత పార్టీ స్థాపిస్తారని ప్రచారం సాగింది. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే, వాటన్నింటినీ తోసిపుచ్చిన లక్ష్మీనారాయణ.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు జనసేన అధినేత పవన్‌తో లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. దాదాపు వీరిద్దరూ 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. విశాఖపట్నం నుంచి జనసేన తరఫున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు సమాచారం. అక్కడ  కాకపోతే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు. అయితే పవన్ కల్యాణ్‌ ఆయన్ను రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరారు. దీంతో ఎక్కడ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉంటారనేది తేలలేదు. కర్నూలు లేదా నంద్యాల స్థానం నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ లక్ష్మీనారాయణ మాత్రం విశాఖపట్నం వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రానికి ఆయన పోటీ చేసే స్థానంపై స్పష్టత రానుంది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *