లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ బోర్డ్ బ్రేక్

Spread the love

CENSOR BRAKES LAKSHMI’S NTR

  • ఏపీలో ఎన్నికలు ముగిశాక విడుదల చేయాలని ఆదేశం
  • బోర్డు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని వర్మ ఆరోపణ
  • సెన్సార్ బోర్డుపై కేసు పెడతానని వెల్లడి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ బోర్డు బ్రేక్ వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ సినిమాను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో సెన్సార్ బోర్డుపై వర్మ ధ్వజమెత్తారు. బోర్డు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్‌ జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈనెల 22న సినిమా విడుదల చేస్తున్నామని గతంలోనే వర్మ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. అయితే, ఈ సినిమా టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల చేస్తే అది ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. దీనిపై తాజాగా ట్విటర్‌ ద్వారా వర్మ స్పందిస్తూ.. సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.

TELUGU CINEMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *