డాక్టర్లపై దాడి చేస్తే జైలే!

CENTER FOCUS ON DOCTORS

దేవుడి తర్వాత దేవుడిగా వైద్యుల్ని భావిస్తుంటారు. రోగాలు నయం చేయాలన్నా.. ప్రాణాలు కాపాడాలన్నా డాక్టర్లు కావాల్సిందే. అయితే, ఇటీవల కాలంలో వారిపైనా దాడులు పెరిగిపోయాయి. చికిత్స చేయడంలో నిర్లక్ష్యం చేశారనో, సరిగా వైద్యం చేయలేదనో రోగుల తరఫు బందువులు వైద్యులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులపై దాడికి పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ ముసాయిదా బిల్లు రూపకల్పన చేస్తోంది. దాని ప్రకారం.. డాక్టర్లపై దాడి చేసినవారికి కనిష్టంగా మూడేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధించనున్నారు. అలాగే ఆస్పత్రిపై దాడి చేసి నష్టం కలిగించినవారినీ ఉపేక్షించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాంటివారికి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు బిల్లు రెడీ అవుతోందని సమాచారం. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సర్కారు.. వైద్యుల భద్రతనూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందుకే ఈ ముసాయిదా బిల్లు తీసుకొస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *